Weather Update: తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించాయి. దీంతో నేడు, రేపు (గురు, శుక్ర)వారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రాజమండ్రి వద్ద గోదావరిలో క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి నీరు చేరడంతో నీటిమట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.79 మీటర్లకు నీటిమట్టం చేరింది.
CS Shantikumari: భారీ వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ జామ్, వరద నీటి నిల్వ వంటి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
అనుకున్న సమయానికి ముందే మే 30న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు... క్రమంగా ముందుకు కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో కేరళవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, అక్కడ నుంచి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి.
భారత్ లో రోజు రోజుకు ఎండలు మండుతుంటే.. విదేశాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బ్రెజిల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జనాలు అల్లాడుతున్నారు. దేశంలో పెద్ద ఎత్తున వరదలు పోటెత్తాయి.
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్ర రూపంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. కాగా.. ఇంతటి ఎండల్లో ఒక చల్లటి వార్త బయటికొచ్చింది. రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Anand Mahindra Tweet on Dubai Rains 2024: సాధారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఎండలు ఎక్కువ. ఎడారి దేశం కాబట్టి అక్కడ వర్షాలు తక్కువే. ఎప్పుడో కానీ.. భారీ వర్షాలు కురవవు. అలాంటి యూఏఈలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం (ఏప్రిల్ 16) బలమైన గాలులు, ఉరుములు-మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. దుబాయ్‌లో అయితే ఈ వర్ష బీభత్సం మరీ…
Heavy Rains His UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులు, వీధులు మొత్తం జలమయం అయ్యాయి. భారీ వరదలకు దుబాయ్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. ఓవైపు వరదలు, మరోవైపు తీవ్ర గాలుల కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. యూఏఈ మొత్తం పాఠశాలలను మూసివేశారు. చాలా మంది ఉద్యోగులు, కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. వీధులు, రహదారుల్లోని నీటిని…