భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది. దీంతో ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది.
Adilabad Rains: భానుడి భగభగలతో అల్లాడుతున్న ఆదిలాబాద్ జిల్లా వాసులకు వాన జల్లులు పలకరించాయి. ఇవాళ ఉదయం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది.
Weather Update: మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ చిలిపిగా పలకరించింది. తెలంగాణలో నేటి నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుందని అధికారులు వెల్లడించారు.
జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం నాడు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Hariah Rao: రైతులకు రూ.10వేలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.
ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే కప్పలకు పెళ్లి చేయడం, విందు భోజనం ఏర్పాటు చేయడం లాంటివి చేస్తారు. ఇక, వర్షాల కోసం వరుణయాగం, కబడ్డీ ఆటలు, పాటలు పాడటం చేస్తారు. తాజాగా అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాలో ఆదర్శ గోరెహగి గ్రామంలోని స్థానికులు వరుణ దేవుడి కటాక్షాన్ని పొందడానికి పురాతన మార్గాలను ఆశ్రయించారు.
Heavy Rain Hits Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం తమిళనాడులోని దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి మరియు కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయంగా మారడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు బ్యాంకులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూత్తుకుడి జిల్లాలోని…
Heavy Rains in AP Due to Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాన్ వాయుగుండంగా బలహీనపడింది. ఈ వాయుగుండం ఈరోజు మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశముంది. మిచాంగ్ ప్రభావంతో ఏపీలో ప్రస్తుతం వర్షాలు ఉరుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు వద్ద వైరా,…