AP-TG Rains: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. తెలంగాణ రైతాంగానికి హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. జూన్ 10 నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయనితెలిపింది. జూన్ 2న ఏపీలో.. తెలంగాణలో జూన్ 10 నుంచి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు జూన్ 10 నాటికి తెలంగాణకు చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. జూన్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా.. జూన్ 1 నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తున్న సంగతి తెలపడంతో.. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. మరోవైపు మరికొన్ని గంటల్లో రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. దీంతో రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
Read also: అందాలతో మతిపోగొడుతున్న మాళవిక శర్మ..
రెండు మూడు రోజుల్లో మరింతగా విస్తరించేందుకు అనుకూల అవకాశాలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. జూన్ 2 నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రెండు రోజుల పాటు ఏపీలో పొడి వాతావరణం ఉంటుందన్నారు. దక్షిణ కోస్తాలో వడగాలులు వీస్తాయి. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో భారీ మేఘాలు కమ్ముకుని భారత భూభాగంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల కదలికలతో ఏపీలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఏపీలో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అన్నీ కుదిరితే జూన్ మొదటి వారంలోనే రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భావిస్తున్నారు.
Power Cuts: గమనిక.. నేడు హైదరాబాద్ లో పవర్ కట్..