Telangana Heavy Rains: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఒక్కసారిగా మేఘావృతంగా మారడంతో నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ వుందని పేర్కొన్నారు.
Read also: Elon Musk: భారత పర్యటనను రద్దు చేసుకున్న ఎలాన్ మస్క్..
నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు అధికారులు. ఎల్లుండి యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు.
Read also: Gold Price Today : తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి ధరలు.. తులం ఎంతంటే?
హైదరాబాద్ జంటనగరాల్లో నేడు వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వానకు ఒక్కసారిగ వాతావరణం చల్లబడింది. పాతబస్తీ, సికింద్రాబాద్, కోటి, నాంపల్లి, ముషీరాబాద్, కబడిగూడ, గాంధీనగర్, చిక్కడపల్లి, లంఘార్ హౌస్, షేక్ పెట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగీ, గండిపేట్, హిమాయత్ సాగర్, పుప్పాల్ గూడ, మణికొండ పలు ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మాన్ సూన్ టీమ్స్ రోడ్లపై వర్షపు నీరు క్లియర్ చేస్తున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, నాంపల్లి, కోటి, తదితర ఏరియాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.
Jersy Rerelease : ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన నాని..?