గత నాలుగు రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో నైనిటాల్‌తో ప్రముఖ పర్యాటక ప్రాంతం రాణిఖేత్, అల్మోరాలకు సంబంధాలు తెగిపోయాయి. రాణిఖేత్‌లో కేవలం 24 గంటలకు మాత్రమే సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని ఈ ఇంధనాన్ని అత్యవసర సేవలకు మాత్రమే వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. ఇంటర్నెట్ సేవలు స్థంభించిపోయాయి. ఇటు, అల్మోరా ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితి నెలకొన్నది.…
వరుస వరదలతో ఉత్తరాఖండ్ విలవిలలాడుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అక్కడి జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. రాష్ట్రంలోని నైనితాల్ నదీ ఉగ్రరూపం కారణంగా 30 మంది మరణించారు. చంపావత్ నదీ ప్రవాహం…
దేశ వ్యాప్తంగా టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో టమోటా పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టమోటా పంటలు ఎక్కువగా పండే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రైతులు తమ నష్టాన్ని ధరలు పెంచి భర్తీ చేసుకుంటున్నారు. అకాల వర్షాల వల్ల టమోటాల సరఫరా తక్కువ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యమైన వెజిటబుల్…
గత మూడు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి రోజున 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారంటే అర్థం చేసుకొవచ్చు. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక నదులు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నిండిపోవడంతో నీటికి దిగువ ప్రాంతాలకు వదులుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందకాయం ప్రాంతంలోని మణిమాల నదికి వరద పోటెత్తింది. నదీ ఉగ్రరూపం…
కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. గత రెండు రోజులుగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు ప్రమాదకరస్థితిలో ప్రవహిస్తుండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. తిరువనంతపురం, కొట్టాయం, పథనం మిట్ట, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, త్రివిధ దళాల సైన్యం…
ఉత్తరాఖండ్ కు మరో ముప్పు పొంచి ఉన్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈరోజు నుంచి ఆ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో దిగువ ప్రాంతంలోని ప్రజలను తరలించారు. అంతేకాదు, బద్రీనాథ్ యాత్రను…
ఉత్తరాఖండ్‌లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొనడంతో ఆ రాష్ట్రం అప్రమత్తం అయింది. బద్రీనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బద్రీనాథ్ యాత్రకు వెళ్లే భక్తులు జోషిమఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఇక చమోలీ జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దని జిల్లా అధికారులు పేర్కొన్నారు. గతేడాది చమోలీ జిల్లాలో పెద్ద ఎత్తున మంచు పెళ్లలు విరిగిపడటంతో…
కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా, 12 మంది గల్లంతైనట్టు అధికారులు పేర్కొన్నారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలను కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. కేరళలో త్రివిధ…
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రేఖ కోహిమా, సిల్చార్ , కృష్ణానగర్ బారిపాడు, మల్కన్ గిరి, నల్గొండ, బాగల్కోట్, వెంగూర్ల, గుండా వెళుతూనే ఉంది. పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా మరియు ఉత్తర ఆంధ్ర తీరం లో గల అల్పపీడనము దానితో పాటు అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్రమట్టానికి 5.8 కిమీ ఎత్తు వరకు ఉండి ఎత్తు లో నైరుతి దిశకు వంగి ఉంటుంది. తూర్పు…
పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా మరియు ఉత్తర ఆంధ్ర తీరంలో గల అల్పపీడనం దానితో పాటు అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశకు వంగి ఉంది.. దీని ప్రభావంతో, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో 15 నుండి 16 అక్టోబర్ 2021 వరకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది..…