మొదటి రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు మాట్లాడిన సీఎం జగన్, సమావేశం ముగిసిన తర్వాత మరోసారి జిల్లా కలెక్టర్లతో వర్షాల పరిస్థితులపై సమీక్షించారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షించిన సీఎం జగన్ వారికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాల, ప్రభావాన్ని అడిగి తెలుసు కున్నారు. సీఎం జగన్.రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు తగిన చర్యలు తీసుకోవా లన్నారు. అవసర మైన చోట వెంటనే సహాయక…
తిరుపతి వర్షంతో వణికిపోతోంది. వరుణ దేవుడు తన ప్రతాపం చూపడంతో ఆధ్యాత్మిక క్షేత్రం అల్లాడిపోతోంది. ఎటు చూసినా వరదలే. జనం అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. తిరుపతిలోని మ్యూజియం పక్కనే వున్న ఏపీ టూరిజం హోటల్ వెనుక వైపున విరిగి పడ్డాయి కొండచరియలు. గోడకూలి ఇరుక్కుపోయారు వంట మాస్టర్, మరో మహిళ. ఇరువురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు ఫైర్ సిబ్బంది. పీలేరు సమీపంలో అగ్రహారం చెరువు పూర్తిగా నిండడంతో చెరువు తెగే ప్రమాదం ఏర్పడింది. దిగువ భాగాన…
భారీవర్షానికి చిత్తూరు జిల్లా వణికిపోతోంది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం లో 79.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మధురానగరిలో వర్షం నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతోంది. ఈ భారీ వర్షానికి జంగాలపల్లి పాపిరెడ్డి పల్లి యు. ఎం పురం, పాతపాలెం జిఎంఆర్ పురం లో నీరు పొంగి పొరలడంతో వాగులు దాటలేక , పాఠశాల విద్యార్థులు స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జంగాలపల్లె వాగు దాటలేక ఓ ఇంటి వద్ద ,ఓ ప్రైవేట్…
ఏపీని భారీవర్షాలు వణికిస్తున్నాయి. చెన్నైకి ఆగ్నేయంగా 310కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమయి వుంది. రేపు తమిళనాడు,దక్షిణ కోస్తా మధ్య తీరం దాటనున్న వాయుగుండం. కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ మెస్సేజ్ వార్నింగ్ జారీ చేసిన ఐఎండీ. రెండు జిల్లాలలో రేపటి వరకు భారీ వర్షాలు. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం వుంది. నెల్లూరు జిల్లా కావలిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. జలదిగ్బంధంలో కపిలతీర్దం. ఆలయంలోకి భక్తుల అనుమతి నిలిపివేసింది టీటీడీ.…
జోరున పడుతున్న వానలతో ఉత్తరాంధ్రలోని రిజర్వాయర్లు నిండిపోయాయి. విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది.. ఎప్పుడు ఏమౌతుందో అని ప్రజల్లో ఆందోళన నెలకొంది. గంట్యాడ మండలం గోస్తనీ నదిపై తాటిపూడి వద్ద నిర్మించిన రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. విశాఖ ఏజెన్సీ అరకు అనంతగిరి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువకు నీరు వచ్చి చేరడంతో తాటిపూడి రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 297 అడుగులు కాగా గరిష్ట…
వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది. అధికారులు, మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. అండమాన్ సముద్రంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 17న అల్పపీడనం తీరం దాటనుంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయి. ఇటు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అన్ని స్కూళ్లు, కాలేజీలకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. మరో 24…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి… ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండగా.. బలమైన ఈదురు గాలులు కూడా ఇబ్బంది పెడుతున్నాయి.. ఏపీలోని తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50-60 కిలోమీటర్ల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు… అత్యవసరమైతే…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం చైన్నైకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. దీంతో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరివర్షంపడి రోడ్లు జారే అవకాశం ఉంటుంది. వాహనాదారులు నెమ్మదిగా వెళ్లాలి. విద్యుత్ సమస్యలు ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వా లి. కానీ స్వతహాగా రిపేర్లు…
చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం పీవిపురం వాగులో ఓ మహిళ గల్లంతయింది. పీవీపురంవాగు దాటుతూ వుండగా నీటి వేగానికి అదుపు తప్పి.. ఓ మహిళ గల‌్లంతైంది. పీవిపురానికి చెందిన ఇద‌్దరు మహిళలు, ఒక యువకుడు పొలం వద్ద నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వాగును దాటుతుండగా ప్రవాహం వేగానికి కొంతదూరం కొట్టుకొని పోయారు. యువకుడు ఒకరిని రక్షించ గలిగాడు. ఈ ప్రమాదంలో 37 ఏళ్ళ సరళ అనే మహిళ వాగులో కొట్టుకు పోయింది. సమాచారం తెలుసుకున‌్న…
తుపాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడుతోంది. తుపాన్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, దాన్ని ఎదుర్కొనేందుకు తిరుపతిలో యంత్రంగం సిద్ధంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతిలో తుపాన్ ప్రభావంతో దెబ్బ తిన్న ప్రాంతాలలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. జోరు వాన, గాలిని సైతం లెక్కచేయకుండా కలియదిరిగారు. లక్ష్మీపురం కూడలి వద్ద మోకాలి లోతైన నీటిలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. అశోక్ నగర్ వద్ద చెట్టు…