గత రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి లక్షకు పైగా ఇన్ ఫ్లో వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,29,038 క్యూసెకులు ఉండగా ప్రస్తుతం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత నీటిని దిగువకు వదులుతున్నారు. దాంతో ప్రస్తుతం శ్రీశైలం ఔట్ ఫ్లో 1,76,535 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి…
నిన్నటి రోజున నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు నగరంలో పెద్ద ఎత్తున వరద సంభవించింది. ఈ వరద కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీ వరద వచ్చిచేరింది. ఈ వరద కారణంగా జంట జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. దీంతో మూసీలోకి వరద వచ్చి చేరింది. ఈ వరదల్లో మొసలి కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందారు. వెంటనే జూ అధికారులకు సమాచారం అందించారు.…
నిన్న రాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. రోడ్లపైకి వరదనీరు వచ్చి చేరింది. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నిన్నటి వర్షం నుంచి ఇంకా కోలుకోక ముందే జీహెచ్ఎంసీ అధికారులు మరో కీలక సూచనలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ప్రజల…
హైదరాబాద్ గుండె మరోసారి చెరువైంది. రోడ్లు జలాశయాలను తలపించాయి. దాదాపు రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా కురిసిన భారీ వర్షానికి ఏది రోడ్డో , ఏది నాలానో తెలియని పరిస్థితి. నగరవాసులు ఇళ్లకు చేరుకునే సమయంలో వర్షం మొదలవడంతో ఎక్కడికక్కడ జనం రోడ్లపక్కన తలదాచుకున్నారు. వరదనీటిలో చిక్కుకుని పలువురు ప్రమాదానికి గురయ్యారు. ఎల్బీనగర్ సమీపంలోని చింత కుంటలో డ్రైనేజీలో పడి గల్లంతైన వ్యక్తి…
06 అక్టోబర్ 2021నుండి వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమునకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. దక్షిణ…
సిమ్లాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయం అయ్యాయి. కొండలకు అనుకొని ఉన్న భవనాల్లో నివాసం ఉంటున్న ప్రజలు భయం భయంగా కాలం గడుపుతున్నారు. ఎప్పుడు కొండచరియలు విరిగిపడతాయో, ఎప్పుడు భవనాలు కూలిపోతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే, భారీ వర్షాల కారణంగా పగుళ్ళు ఏర్పడిన ఓ 8 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. భవనానికి పగుళ్లు రావడంతో అందులో నివశిస్తున్న…
ఈ రోజు తూర్పు గాలులలోని అవర్తనము ఆగ్నేయ బంగళాఖాతం నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు పశ్చిమ ఉత్తర ఝార్ఖండ్ మరియు పరిసర బీహార్ ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 7.6కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ రోజు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా ప్రదేశములలో, రేపు అనేక ప్రదేశములలో…
గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ వరద కారణంగా దీంతో ఆయా ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మూసి నదికి పెద్ద మొత్తంలో వరద వచ్చి చేరుతున్నది. ఈ వరద కారణంగా నగరంలోని…
గతేడాది వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.. నష్టపోయిన రైతులకు 3 నెలల్లో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది.. నాలుగు నెలల్లో బీమా సొమ్ము కూడా చెల్లించాలని ఆదేశించిన కోర్టు.. నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం, బీమా చెల్లించాలని పేర్కొంది.. పంట దెబ్బతిన్న రైతులను కూడా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది.. రైతు స్వరాజ్య వేదిక విస్సా కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ఎస్.ఆశలత పిల్ పై…
తెలంగాణ వ్యాప్తంగా గులాబ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో.. ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.. రేపు, ఎల్లుండి జరగనున్న ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.. వాయిదా పడిన పరీక్షలు మరల…