ఉత్తరాఖండ్ కు మరో ముప్పు పొంచి ఉన్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈరోజు నుంచి ఆ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో దిగువ ప్రాంతంలోని ప్రజలను తరలించారు. అంతేకాదు, బద్రీనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ఈరోజు స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ప్రజలు ఇళ్లనుంచి అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని పేర్కొన్నది. చమోలీ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Read: దూకుడు పెంచిన శశికళ… ఆమెకే పగ్గాలు అప్పగిస్తారా?