కడప జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెయ్యేరు నది పొంగి పొర్లుతోంది. దీంతో చెయ్యేరు నది ఒడ్డున ఉన్న శివాలయం మునిగిపోయింది. దీంతో అక్కడ కార్తీకమాస పూజల కోసం వచ్చిన భక్తులు వరదలకు కొట్టుకుపోయారు. మొత్తం 26 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీరిలో 14 మంది మృతదేహాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. మృతులంతా పులమత్తూరు, మందపల్లికి చెందినవారుగా గుర్తించారు. Read Also: జగన్ గాల్లో నుంచి కిందకు…
తిరుపతిలో నిన్న కొద్దిగా శాంతించిన వరణుడు ఈరోజు తిరిగి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి తిరుమల, తిరుపతిలో భారీగా వర్షం కురుస్తోంది. ఈ వర్షాల ధాటికి మళ్లి చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే తిరుపతి నగరంలో ఎటు చూసినా నీరు తప్పించి మరేమి కనిపించడంలేదు. Read: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత… అటు తిరుమలకు వెళ్లే మెట్ల మార్గం, రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. శ్రీవారి మెట్టు మార్గం…
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లన్నీ తడిశాయని బీజేపీ రాష్ర్ట అధ్యక్షడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీరాష్ట్ర అధ్యక్షుడిగా నేను రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను కలవడానికి వెళ్తే టీఆర్ఎస్ నాయకులతో, కార్యకర్తలతో రాళ్లతో, కట్టెలతో దాడి చేయించే ప్రయత్నం చేశారు. కానీ నేను మొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో మాట్లాడిన తర్వాత ఏ అంశాలు లేవనెత్తానో అవే ఈరోజు…
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోడీ. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ప్రధానికి వివరించారు జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు జగన్. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత వారం రోజులుగా…
భారీవర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు వంకలతో జనం గల్లంతవుతున్నారు. కడప జిల్లా చెయ్యేరు వరదలలో గల్లంతయిన వారి కోసం హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపడుతున్నారు అధికారులు. గుండ్లూరు వద్ద వరద ప్రవాహంలో చిక్కుకున్న యువకుణ్ణి రక్షించింది నేవీ హెలికాప్టర్. పులపత్తురు శివాలయంలో పూజలకు వెళ్లి గల్లంతయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కార్తీకదీపం వెలిగించేందుకు వెళ్లి వరదల్లో గల్లంతయ్యారు. అందులో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం అయ్యాయి. చెయ్యేరులో కొట్టుకుపోతున్న మరో మృతదేహంని స్వాధీనం చేసుకున్నారు. చెయ్యేరు…
ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజంపేట మండలంలో వాగులు, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. రామాపురం చెయ్యేరు నదిలో రెండు ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు ఇరుక్కుపోయాయి. ఓ బస్సులోని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. మరో బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో బస్సు పైకి ఎక్కారు. తమను కాపాడాలంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. మరోవైపు జిల్లాలోని సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. లక్ష క్యూసెక్కుల ఇన్…
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి- చెన్నై సమీపంలో తీరం దాటింది. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఈరోజు రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతారవణ శాఖ తెలియజేసింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతారవణ శాఖ…
అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రమైన అనంతపురంలో రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది. అనంతపురంతో పాటుగా కదిరి, పుట్టపర్తిలో కూడా భారీగా వర్షం కురుస్తున్నది. జిల్లాలోని చిత్రావతి, బుక్కపట్నం చెరువుకు భారీగా వరదనీరు చేరుతున్నది. చెరుపులు పూర్తిస్తాయిలో నిండిపోవడంతో అటువైపు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిత్రావతికి భారీగా వరదనీరు చేరడంతో పుట్టపర్తి బ్రిడ్జిపైన ప్రవహిస్తోంది. Read: స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీకీ నెంబర్ వన్ ర్యాంకు దీంతో పుట్టపర్తి-కర్ణాటక నాగేపల్లికి…