బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి- చెన్నై సమీపంలో తీరం దాటింది. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఈరోజు రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతారవణ శాఖ తెలియజేసింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతారవణ శాఖ తెలియజేసింది.
Read: లైవ్: తిరుపతిలో జలప్రళయం…
ఇక తీరం వెంబడి 45 నుంచి 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలియజేసింది. సహాయ చర్యలకు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని సహాయ చర్యలు చేపడుతున్నాయి. మరో 24 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.