ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో వాగులు, వంకలు, నదులు పొంగిపోర్లుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి నగరం వర్షాల ధాటికి అల్లకల్లోలంగా మారిపోయింది. శ్రీవారి భక్తులతో నిత్యం కళకళలాడే తిరుపతి నగరంలో ఇప్పుడు ఎటు చూసినా వరద నీరే కనిపిస్తున్నది. లొతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Read: అహంకారంపై రైతుల సత్యాగ్రహం విజయం…
ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక, తిరుచానూరులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వాగులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో ఓ ఇల్లు కొట్టుకుపోయింది. రెండు అంతస్తుల ఇల్లు వరద నీటికి కొట్టుకుపోవడంతో సమీపంలోని ఇళ్లను కూడా ఖాళీచేయించారు అధికారులు.