భానుడి ప్రతాపంతో ఉక్కపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిని వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సూచించింది.
Rain in Andhra Pradesh: తెలంగాణలో ఎండలు విజృంభిస్తుండగా… అటు ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో మూడు రోజులకు సంబంధించి వెదర్ రిపోర్ట్ విడుదల చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం ఈ ప్రాంతంలో పలుచోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో గరిష్ట…
వరుణుడు తెలుగు రాష్ట్రాలను వదలనంటున్నాడు. మరో నాలుగు రోజుల పాటు తన ప్రభావం చూపిస్తానంటున్నాడు. ఈ మేరకు రాబోయే మూడు రోజులకు సంబంధించి అమరావతి వాతావరణ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.
గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో వాయు కాలుష్యం క్రమంగా పెరుగింది. గాలి నాణ్యత తగ్గుతుండడంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంది. వాహనాలు, పరిశ్రమలతో గాలి కాలుష్యం పెరుగుతోంది.
Rains – Yellow Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.. తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.. అయితే, మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.. తమిళనాడు నుంచి కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్ మీదుగా బిహార్ వరకు ద్రోణి విస్తరించి ఉంది.. దీని ప్రభావంతో సముద్రం…
Rain in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. ద్రోణి బీహార్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో కొనసాగుతున్నది. మరోవైపు రాయలసీమ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల అవర్తనము సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో బలహీన పడింది.…
తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది.
సీఎం కేసీఆర్ నేడు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వానతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు.