Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. నైరుతి రుతుపవనాలు తదుపరి 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు అండమాన్ & నికోబార్ దీవులలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విదర్భ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉందని.. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో పశ్చిమ / నైరుతి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.. వీటి ప్రభావంతో రాబోవు మూడు రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయన్నదానిపై ప్రకటన చేసింది..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంలో.. ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.. ఈదురు గాలులు గంటకు 30 -50 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముందని పేర్కొంది.. ఇక, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 -50 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవిస్తాయని తెలిపింది.. మరోవైపు.. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఇక, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ విషానికి వస్తే.. ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 -50 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే వీలుందని పేర్కొంది.. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక, రాయలసీమ విషయానికి వస్తే.. ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.