High Temperature and Rains: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలు.. ఓవైపు వగలాలులు.. మరోవైపు ఈదురు గాలుల్లా ఉంది పరిస్థితి.. ఈ రోజు రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.. నేడు 73 మండలాల్లో వడగాల్పులు, రేపు 12 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని సూచించింది.. వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల సంఖ్య 73గా ఉంన్నరాయి.. అందులో అల్లూరి 3, బాపట్ల 1, తూర్పుగోదావరి 11, ఏలూరు 5, గుంటూరు 15 మండలాల్లో డగాల్పులు వీచే అవకాశం ఉండగా.. కాకినాడ 8, కృష్ణా 9, ఎన్టీఆర్ 10, పల్నాడు 5, మన్యం4, వైయస్సార్ జిల్లాలోని 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపనుందని పేర్కొంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇక, నిన్న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లెలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తిరుపతి జిల్లా గూడూరు లో 44.6 డిగ్రీలు, బాపట్ల జిల్లా చెరుకుపల్లి, ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో 44.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. ఇక, 35 మండలాల్లో వడగాల్పులు వీచాయి. మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.. పిడుగుపాటు, వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్..
మరోవైపు ఈ రోజు వాతావరణ పరిస్థితులపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రజలను అప్రమత్తం చేశారు.. నేడు వడగాలులు వీచే జిల్లాలో 11 మండలాలు ఉన్నాయని.. వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.. జిల్లాలో 11 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.. చాగల్లు 42, గోకవరం 41.3, గోపాలపురం 34.6 , కోరుకొండ 42.8 , కొవ్వూరు 32.0 , రాజమహేంద్రవరం అర్బన్ 37.1 , రాజమహేంద్రవరం రూరల్ 39.8 , రాజానగరం 36.9 , రంగంపేట 32.8 , సీతానగరం 33.9 , తాళ్లపూడి 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్ళే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని, వెంట త్రాగునీరు, మజ్జిగ, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు దగ్గర ఉంచుకోవాలని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని.. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్దులు తగిన విధంగా వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కలెక్టర్ మాధవీలత హెచ్చరించారు.