Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ దిశగా పయనిస్తూ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ భాగాలపై వ్యాపించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Telangana Rain Updates: తెలంగాణలో వర్షాలు కురిసి దాదాపు 15 రోజులు కావస్తోంది. జూలై చివరి వారంలో కురిసిన వర్షాలు ఎడతెరిపి లేకుండా మాయమయ్యాయి. రైతులకు ఆగస్టు నెల కీలకం.. వరుణుడు ముఖం చాటేశాడు.
తెలంగాణలో ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది.. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది.. అయితే, దీని ప్రబాశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు.. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే అవకాశం…
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ లో బలపడిన అల్పపీడనం… పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.. ఇక, ఇది క్రమంగా ఎల్లుండి ఉదయానికి తుఫానుగా మారుతుందని.. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఇక,…
వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈ తీవ్ర అల్పపీడనం.. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రెండు రోజులు నుంచి వర్షాలు తగ్గాయని అనుకునేంతలోపే మళ్లీ తెలుగు రాష్ట్రాలపై మరోసారి వరుణుడు గర్జించనున్నాడు వర్షం నగరాన్ని ముంచెత్తింది. షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీగా వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్‌లో అక్కడక్కడా భారీ…
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు, చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇంకా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షలు పడుతున్నాయి. దీంతో, ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.. ఇక, భారీ వర్షాల దృష్ట్యా.. తెలంగాణ ప్రభుత్వం బుధవారం వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, వాతావరణశాఖ తాజా ప్రకటన ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో…
జూన్ రెండవ వారం నడుస్తోంది. అయినా చినుకు జాడలేదు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రుతుపవనాలు కేరళను తాకేశాయని, మనకు ఈసారి ముందే వానలు పలకరిస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా అయిదారు డిగ్రీలు అదనంగా పెరగాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతపవనాల రాకలో జాప్యం కారణంగా జూన్ రెండోవారంలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. మే 29న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తెలంగాణలోకి…