Rains Alert: ఏపీలో మూడు రోజుల భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ లో బలపడిన అల్పపీడనం… పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.. ఇక, ఇది క్రమంగా ఎల్లుండి ఉదయానికి తుఫానుగా మారుతుందని.. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఇక, దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని.. మిగిలిన చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది..
Read Also: Srikakulam Crime: వైసీపీ నేత దారుణ హత్య.. కత్తితో నరికి..!
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
ఇక, వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ… దక్షిణకోస్తాంధ్ర -తమిళనాడు తీరాల వెంబడి శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు స్పష్టం చేసింది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన ప్రకటనలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్. మరోవైపు.. మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తమిళనాడుకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.. చెన్నై, కడలూరు, కన్యాకుమారి సహా ఆరు జిల్లాలకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి… ఈ నెల 10వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లద్దని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు..
తాజావార్తలు
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!