Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rain Updates: తెలంగాణలో వర్షాలు కురిసి దాదాపు 15 రోజులు కావస్తోంది. జూలై చివరి వారంలో కురిసిన వర్షాలు ఎడతెరిపి లేకుండా మాయమయ్యాయి. రైతులకు ఆగస్టు నెల కీలకం.. వరుణుడు ముఖం చాటేశాడు. ఎదుగుదల దశలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. చాలా రోజుల తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.
Read also: Tulsi Archana: వేంకటేశ్వర స్వామి తులసి అర్చన.. విశేష స్తోత్ర పారాయణం
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో గురువారం (ఆగస్టు 17) ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా ఉందన్నారు. దీని ప్రభావంతో నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమురభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎస్ శాంతికుమారి మాట్లాడారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read also: Astrology: ఆగస్టు 19, శనివారం దినఫలాలు
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా చాల్పూర్‌లో 7.95, ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 7.6, భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 5.76 సెం.మీ. వర్షం పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 5.6, ఏటూరు నాగారంలో 5.1, వెంకటాపురంలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, కుమురంభీం-ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. నగర శివార్లలో చిరు జల్లులు పడ్డాయి.
Venkateswara Stotram: తొలి శ్రావణ నాడు ఈ అభిషేకం వీక్షిస్తే సుఖజీవితాన్ని గడుపుతారు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!