ఎగువ నుంచి భారీ వరదలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది.. లంక గ్రామాలను గోదావరి ముంచెత్తుతోంది.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 15.20 అడుగులకు చేరింది నీటిమట్టం.. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు.. బ్యారేజీ నుండి 15 లక్షల 21 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.. అయితే, గడిచిన 24 గంటలూగా గోదావరిలో అదే పరిస్థితి కొనసాగుతోంది.. అయితే, ధవళేశ్వరం దగ్గర 11.75 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ…
గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో కొద్దిరోజులుగా తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా జులై మొదటివారంలోనే భారీవర్షాలు కుమ్మేస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పదేళ్ల నాటి వర్షపాతం రికార్డులు సైతం గల్లంతయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం కంటే రెండింతలు ఎక్కువగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. గోదావరి వరదతో భద్రాద్రి రామాలయం పడమరమెట్ల వద్ద…
పలు జిల్లాలో ఈనెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. బుధవారం నాడు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. తూర్పు, మధ్య బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నది.…
అసని తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో వాన కురుస్తుంది. నగర వ్యాప్తంగా ఉదయం 4.30 గంటల నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఆకాశం మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణం చల్లబడటంతో నగరవాసులకు ఉక్కబోత నుంచి ఉపశమనం లభినట్లయింది. బుధవారం తెల్లవారుజాము నుంచే హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, నాంపల్లి, లక్డీకపూర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో వానకురుస్తున్నది. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చిరు జల్లులు పడుతున్నాయి. అసని తుఫాను…
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ తీవ్రరూపం దాల్చి తీరం వైపు దూసుకొస్తుంది.. ఇప్పటికే తీరం వెంబడి ఉన్న జిల్లాల అధికారులు అప్రమత్తం అయ్యారు.. మరోవైపు అసని తుఫాన్‌తో అలెర్ట్ అయ్యింది తూర్పు నావికాదళం.. ఆంధ్రప్రదేశ్, ఒడిషా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి తీవ్ర తుఫాన్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తోంది నావికాదళం… విపత్కర పరిస్థితుల్లో సహాయ, వైద్య సేవలు అందించేందుకు యుద్ధనౌకలు, హెలీకాఫ్టర్లును అందుబాటులో ఉంచింది నేవీ.. విశాఖలోని ఐ.ఎన్.ఎస్ డేగా… చెన్నైలోని ఐ.ఎన్.ఎస్ రాజాలీ నుంచి ఏరియల్ సర్వే,…
తీరం వైపు దూసుకొస్తున్న అసని తుఫాన్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా విశాఖలో భారీ వర్షం పడుతోంది… అయితే, ‘అసని’ తుఫాన్ దిశ మార్చుకున్నట్టు వాతావరణశాఖ చెబుతోంది.. రేపు సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉందని.. మచిలీపట్నం దగ్గర తుఫాన్ తీరం దాటే సూచనలు ఉన్నాయని… దీని ప్రభావంతో.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఇక, దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ…
తెలుగు రాష్ట్రాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంపై ఆకాశం మేఘావృతమై ఉంది. ఓ మోస్తరు వర్షం కురవడంతో సిటీ వెదర్ ఒక్కసారిగా చల్లబడింది. దాంతో ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం లభించింది. మరోవైపు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో ఏప్రిల్ 18 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి.. ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు.. అయితే, తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని.. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.. ఇక, ఎల్లుండి ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో వర్షం పడుతుందని.. ఈ…
ఎండ ప్రచండ కిరణాలనుంచి హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది. వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం, తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఉన్న అల్పపీడనం తూర్పు-ఈశాన్య దిశగా కదిలి, ఈరోజు 0830 గంటల IST సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద తీవ్ర అల్పపీడనంగా ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అండమాన్ నికోబార్ దీవుల వెంబడి ఉత్తర…