తెలంగాణలో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి.. చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది.. ఇదే సమయంలో.. మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆదివారం నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. అంతేకాదు.. అకాల వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.. కాగా, ఇప్పటికే తెలంగాణలో కురిసిన వర్షాలతో…
హైదరాబాద్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది… రాత్రి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినా.. ఆ తర్వాత మళ్లీ సాధారణ వాతావరణం నెలకొంది.. చలి కూడా తీవ్రంగానే ఉంది.. అయితే, ఉదయం వాతావరణ మారిపోయింది.. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. ఇవాళ ఉదయం నుంచి ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్య పురి, కొత్తపేట్, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. ఇక,…
సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని… ఈ నేపథ్యంలో ఆది, సోమవారాలలో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. Read Also: మందు బాటిల్ ముందేసుకుని…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురిసాయి.. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.. చెన్నై లాంటి ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు.. అయితే, ఆ అల్పపీడన ప్రభుత్వంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని చెబుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఈ నెల 13వ తేదీన…
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపధ్యంలో అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతోందని, శ్రీహరికోట, తడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తీర ప్రాంత మండల అధికారులను అప్రమత్తం…
అల్పపీడన ప్రభావం వల్ల తిరుమల తడిసి ముద్దయింది. కుండపోత వర్షంతో భక్తులు వణికిపోయారు. ఒకవైపు పౌర్ణమి కావడంతో కలియుగ వైకుంఠానికి భక్తులు పోటెత్తారు. దాదాపు మూడు గంటల పాటు ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయింది. చలి గాలులు కూడా వీస్తుండడంతో భక్తులు బయటకు రావడానికి వెనుకాడారు. అనుకోని అతిథి రాకతో భక్తజనం ఉలిక్కిపడ్డారు. ఉరుములు, మెరుపులతో మధ్యాహ్నం వాన పడింది. తర్వాత 5 గంటల వరకు కుండపోతగా కురుస్తూనే వుంది.…
ఉత్తరాఖండ్‌లోని వరదలు, అందుతున్న సాయం పై పరిశీలించేందుకు నేడు అమిత్ షా వెళ్లనున్నారు. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లు బ్లాక్ అయ్యాయి. మరికొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఇప్పటికే కొండ చరియలు విరిగిపడి శిథిలాల కింద చిక్కుకున్న 42 మందిని కాపాడారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దమానీ వరద నష్టాన్ని మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా అంచనా వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పుష్కర్ సింగ్ ఫోన్‌లో మాట్లాడి సహాయాన్ని అడిగారు.…
తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాలు… అలాగే ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా శ్రీశైలంలో వరద నీరు క్రమంగా పెరిగి జలాశయం నిండు కుండల మారింది. దాంతో శ్రీశైలం గేట్లు ఎత్తారు. జలాశయం 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,71,377 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 1,85,765 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు…
హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం నుంచే వర్షం ప్రారంభమైంది.. ఇప్పటికే.. సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి.. తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.. ఇక, సాయంత్నాకి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి.. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడీగూడ, ఇందిరా పార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. కూకట్పల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో…
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రజలను కలవరానికి గురిచేశాయి.. అయితే, ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, రుతుపవన ద్రోణి దక్షిణాది వైపుగా కొనసాగనుంది. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశమున్నందున నేటి నుంచి 17వ తేదీ వరకు ఉత్తర కోస్తాలో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.…