21 వ శతాబ్దంలో కూడా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. అంతరిక్షంలోకి ప్రయాణాలు చేస్తున్న కాలంలో వర్షాల కోసం అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. వర్షం కోసం వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామంలోని ఆరుగురు బాలికలను నగ్నంగా మార్చి గ్రామంలో ఊరేగించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లా బనియా గ్రామంలో జరిగింది. గ్రామంలో ఆరుగురు బాలికను నగ్నంగా మార్చి కప్పలను కర్రలకు కట్టి వాటిని వారి భుజాలపై ఉంచి వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబందించిన వీడియోలు బయలకు…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు… మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్, మహబుబ్‌నగర్ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఏపీ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జోరుగా…
హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం కురుస్తోంది… బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్ట, అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది… దీంతో.. ప్రధాన రహదారులపై వరద నీరు పొంగిపొర్లుతోంది.. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన జంక్షన్లలో సైతం రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరింది.. దీంతో.. పలుచోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు…
దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిసాయి.. కుండపోత వర్షం దెబ్బకు వీధులు, రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఈ రోజు ఉదయం 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.. 13 ఏళ్లలో ఆగస్ట్ నెలలో ఒకే రోజు అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఈ భారీ వర్షంతో దేశ రాజధానిలో ఆరెంజ్ హెచ్చరిక జారీ…
శ్రీశైలం జలాశయంలో వరద నీరు కొనసాగుతుంది. ఇప్పటికే కృష్ణ నది పై ఉన్న శ్రీశైలం జలాశయంలోకి వరద వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 38,869 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో 42,210 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 878.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 180.6725 టీఎంసీలు ఉంది. అయితే ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుండి…
బంగాళాఖాతం ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెంట్లం(భద్రాద్రి జిల్లా)లో 6.5, పెదవీడు(సూర్యాపేట)లో 3.3, పమ్మి(ఖమ్మం జిల్లా)లో 3.2 సెంటీమీటర్ల వర్షం…
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. ఈ నెల 15 తర్వాత పశ్చిమ మధ్య-వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగస్టు 15 నాటికి బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడుతుందని, అది బలపడి 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వివరించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో, ఇటు హైదరాబాద్ ఆగస్టు 15, 16, 17వ తేదీల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో…
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచిచింది… ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోటర్ల ఎత్తుల మధ్య ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. దీని ప్రభావము వలన 28 జూలై 2021 తేదీన ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం…
సాధారణంగా గల్ఫ్ దేశాల్లో వేడి అధికంగా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే ఉదయం సమయంలో వేడి 50 డిగ్రీల వరకు ఉంటుంది. ఆ వేడి నుంచి తట్టుకోవాలి అంటే ఏసీలు వేసుకున్నా సరిపోదు. అందుకే చాలామంది ఇంటి నుంచి బయటకు రావడానికి సందేహిస్తుంటారు. ఏడారిలో వర్షం కురిసింది అంటే ఇక పండగే పండగా. వేడి పెరిగిపోతుండటంతో కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు దుబాయ్ వాతావరణ శాఖ వినూత్నమైన ప్రయోగం చేసింది. మేఘాల్లోకి ప్రత్యేకంగా తయారు చేసిన డ్రోన్లను పంపి కరెంట్…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి… మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది… వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిమీ నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉండగా.. దాని ప్రభావంతో, వచ్చే 48 గంటలలో వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని.. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు…