దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతాలు, ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు…
ఒడిశా భూ ఉపరితలంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్యదిశగా కదులుతూ రాగల 12 గంటలలో ఛత్తీస్‌గడ్ మీదుగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనం బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఉదయం నుంచి నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. దీంతో వర్షం తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో.. హైదరాబాద్కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు అర్ధరాత్రి వరకు హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో.. జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులను ఐఎండీ అలర్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్తో పాటు వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి,…
AP-TG Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తు నివారణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు రానున్న రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. జులై 12 వరకు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, దీంతో ఎల్లో అలర్ట్‌ను జారీ చేయాలని డిపార్ట్మెంట్ని కోరింది. ఈ నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో గణనీయమైన వర్షపాతం నమోదైంది, రాష్ట్రంలో…