AP-TG Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు ఫుల్ వానలే..
- తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్- పది జిల్లాల్లో ఎల్లో అలర్ట్..
- ఏపీలోని రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్- పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP-TG Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం ద్వారా సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు నుండి 5.8 కి.మీ మధ్యలో కొనసాగుతుంది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మీదుగా వాయుగుండంగా బలపడిన అల్పపీడనం నేడు వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది.
Read also: Telangana: దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
మరో వైపు తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉండగా.. పది జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి మళ్లీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు వర్షం కురుస్తుంది. ఉదయం 10 గంటల తర్వాత వర్షం పెరుగుతుంది. హైదరాబాద్, ఉత్తర, పశ్చిమ తెలంగాణలో సాయంత్రం 5 గంటల తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో రాత్రి 9 గంటల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌లో నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వర్షం కురుస్తోంది.
Read also: Holidays: ఏపీలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు..
ఇక హైదరాబాద్, కామారెడ్డి, కొమరం భీం, మెదక్, ఎన్.మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Read also: Manipur : మణిపూర్‌లో భద్రతా దళాలు చర్యలు.. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
ఏపీలోని రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్, పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ ప్రకటించింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
Live Suicide : వాటర్ ట్యాంక్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధి.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!