Heavy rains in Telugu states for 5 days: తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ & కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ మరియ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం విస్తరించి ఉందన్నారు.
బెంగళూరులో నిన్న (శనివారం) భారీ వర్షం కురిసింది. రాబోయే ఐదు రోజుల పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. నగరంలో అనేక ప్రదేశాలలో నీరు ఎక్కడికక్కడా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ 2 (ఆదివారం) నుండి జూన్ 4 (మంగళవారం) వరకు బెంగళూరులో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్షపాతం హెచ్చరిక జారీ చేయడంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందనుంది . హైదరాబాద్‌లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒకచోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.…
నేడు ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది.
Rain Alert: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేటి (గురువారం) నుంచి ఈ నెల 19 వరకు అక్కడక్కడ తేలికపాటి లేదా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో నేడు, రేపు జల్లులు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) మే 17 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. IMD ప్రకారం, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,…
ఆదివారం సాయంత్రం, రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) హైదరాబాద్ వాసులకు హెచ్చరికలు జారీ చేసింది. కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. వర్షం కారణంగా ఏవైనా సమస్యలు తలెత్తితే, సహాయం కోసం పౌరులు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) 040-21111111 లేదా 9000113667 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. దాదాపు రెండు గంటలపాటు…
తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా తీవ్రంగ పంట నష్టం జరుగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు పెద్ద శంకరంపేట (మం) రామోజీపల్లి వాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే.. ధాన్యం ఆరబెట్టడానికి కొడుకుని తీసుకువచ్చాడు తండ్రి.. ఈ క్రమంలోనే.. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో చెట్టు కిందకి వెళ్లారు…