Reel On Track: రీల్స్ పిచ్చి యువత ప్రాణాలను తీస్తోంది. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని, వ్యూస్, సబ్‌స్క్రైబర్లను పెంచుకోవాలనే పిచ్చి కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ 15 ఏళ్ల బాలుడు కూడా ఇదే విధంగా మరణించాడు. ఒడిశాలోని పూరిలోని రైల్వే ట్రాక్‌పై రీల్ షూట్ చేస్తున్న సమయంలో రైలు ఢీకొని మరణించాడు.
లోకల్ ట్రైన్ లో ప్రయాణించే కొందరు వ్యక్తులు తమ ఆనందం కోసం రకరకాలు ఫీట్లు చేస్తుంటారు. పొరపాటున ఎదైనా జరిగితే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అలా ఎవరైనా ఎదురించి ఇది తప్పని చెబితే.. వారి పైకి దాడులు చేస్తారు. వీళ్ల చేసే పనులతో మిగతా ప్రయాణీకులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Read Also:Mass Festival: ఇదేక్కడి దీపావళి పండగరా బాబు… మరీ ఇలా…
రైలు ప్రమాదం ఈ పేరు వింటేనే కొందరికి భయమేస్తోంది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని సాంకేతిక లోపాలు, తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద రైలు ప్రమాదం ఏదో తెలుసా? దాదాపు 1700 మందిని బలిగొన్న ఈ ప్రమాదం శ్రీలంకలో చోటు చేసుకుంది. 2004లో జరిగిన ఈ దుర్ఘటన ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
బీహార్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కతిహార్ బరౌని రైల్వే సెక్షన్‌లోని కధగోలా, సేమాపూర్ మధ్య మహారాణి గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బరౌని నుంచి కతిహార్‌కి వస్తున్న 15910 అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైలు.. రైల్వే ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక ట్రాలీమ్యాన్ అక్కడికక్కడే మరణించాడు. నలుగురు రైల్వే కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
భారతదేశంలో రైళ్ల మీద దాడులు చెయ్యడం సర్వసాధారణం అయ్యింది. ముఖ్యంగా వందేభారత్ రైళ్లు ప్రారంభం అయిన తరువాత రైళ్ల మీద అల్లరిమూకలు రాళ్లు రువ్వడం చాలా ఎక్కువ అయ్యింది. వందేభారత్ రైళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన తరువాత మామూలు రైళ్ల మీద దాడులు ఎక్కువ అయ్యాయి. రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్‌లను ధ్వంసం చేయడం వంటి కేసులు పెరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం 7,971 కేసులు నమోదైనట్లు…
Elephants : శ్రీలంకలోని హబరానా ప్రాంతంలో గురువారం ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఒక ప్యాసింజర్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరు ఏనుగులు చనిపోయాయి.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట తర్వాత భారతీయ రైల్వే కీలకమైన చర్యలు తీసుకోనుంది. దేశవ్యాప్తంగా 60 రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో శాశ్వత హోల్డింగ్ జోన్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.