Railway Line : దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామగుండం-మణుగూరు కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రైల్వే శాఖ నుండి చివరకు ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ లభించింది. ఈ నిర్ణయంతో పెద్దపల్లి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైల్వే సమస్యల పరిష్కారంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి ఫలిస్తున్నదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వంశీ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇప్పటికే సిద్ధమైందని, సుమారు రూ. 4 వేల…
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశానికి రైల్వే ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కీలక అధికారులు హాజరయ్యారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అధికారం కోసం ఎన్డీఏ, ఇండియా కూటమి పక్షాలు తీవ్రంగా శ్రమిస్తు్న్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా బరిలోకి దిగబోతున్నాయి.
ఈ బడ్జెట్ లో ఏపీకి రూ. 9,417 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయింపులు జరిగాయని తెలిపారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్.. ఈ బడ్జెట్ లో యూపీఏ హయాంలో కంటే ఏపీకి 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు.. ఏపీలో మొత్తం అమలవుతోన్న రైల్వే ప్రాజెక్టులు రూ. 84,559 కోట్ల వరకు కేటాయించామన్నారు.. కొత్త ప్రాజెక్టులు ఓ పద్ధతిలో, శాస్త్రీయమైన రీతిలో కేటాయింపులు జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులను బడ్జెట్ లో ప్రకటించడం లేదన్నారు.. ఇక, రైల్వే…
ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. సీఎం చంద్రబాబుతో రైల్వే మంత్రి భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించాలని సూచించిన ఆయన.. భూకేటాయింపులు పూర్తవగానే విశాఖ రైల్వే జోన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ అంశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పదేపదే ఆరోపిస్తున్నారని, అందుకే తాను ఈ లేఖ రాయాల్సి వస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగానే ఆలస్యం అవుతున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కారు…