ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా విశాఖలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బహిరంగ సభ నేపథ్యంలో భారీ వాహనాలను సిటీలోకి అనుమతించడం లేదు. వాటిని పెందుర్తి మీదుగా శ్రీకాకుళం హైవే వైపు ట్రాఫిక్ మళ్ళిస్తున్నారు.
ప్రధాని బహిరంగసభ సందర్భంగా 8,600 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు. ఏయూ సభా ప్రాంగణం వద్ద ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని విశాఖ సీపీ శ్రీకాంత్ తెలిపారు. ప్రధాని సభకు మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 8 నుంచి 11 మధ్య ఆంక్షలు అమలు కానున్నాయి.
Read Also: Janasena Social Audit in Housing Scheme: జగనన్న ఇళ్ళపై నేటినుంచే జనసేన సోషల్ ఆడిట్
* ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ పరిసరాల్లో ఈ రోజు సాధారణ వాహనాల రాకపోకల నిషేధం విధించారు.
* ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు శ్రీకాకుళం విజయనగరం నుంచి విశాఖ మీదుగా వెళ్లే వాహనాలు ఆనందపురం సబ్బవరం మీదుగా మళ్లిస్తారు.
* అనకాపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లే వాహనాలు లంకెలపాలెం సబ్బవరం పెందుర్తి మీదగా మళ్లింపు
* శనివారం మధ్యాహ్నం మూడు వరకు మద్దిలపాలెం, ఆంధ్రా యూనివర్శిటీ, పెదవాల్తేరు . కురుపాం సర్కిల్… స్వర్ణ భారతి స్టేడియం.. పరిసరాల్లో పూర్తిగా సాధారణ వాహనాల రాకపోకలపై నిషేధం
* అలాగే జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ కు ఇవాళ సెలవు ప్రకటించిన మార్కెట్ కమిటీ.
*. ప్రధాని సభకు వెళ్లే వీఐపీలకు గ్రీన్ ఛానల్ రూట్ ఏర్పాటు చేసినట్లు సీపీ శ్రీకాంత్ ప్రకటన
Read Also: Hyderabad Ragging: మళ్లీ పురివిప్పిన ర్యాగింగ్ భూతం.. రూమ్‌లో బంధించి మరీ..