పల్నాడు జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. బౌద్ధమతం, సిక్కుఇజం, జైనిజం, హిందూయిజం నాలుగు మతాలు భారతదేశం పుట్టినిల్లు. దేశవ్యాప్తంగా స్పిరిట్యువల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నాం. స్వదేశీ దర్శన్ కింద 7 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దేశంలో 50 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రినిర్మలా సీతారామన్ బడ్జెట్ లో చెప్పారు. నాగార్జున కొండను అభివృద్ధి చేసే దిశగా చూస్తున్నాం. కాకినాడ వైల్డ్ లైఫ్ సెంచరీ, బుడమేరు, యశ్యానం, మైపాడ్ బీచ్, బౌద్దమత సర్కూట్, అమరావతి ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం.
అమరావతి లింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి 27.7 కోట్లు మంజూరు చేసాం. స్వదేశి దర్శన్ కింద 141 కోట్లు ఏపీకి ఇవ్వడం జరిగింది. ఏపీ టూరిజం శాఖ ద్వారా ఈ అభివృద్ధి పనులు కేంద్రం చేయిస్తుంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా టూరిజం శాఖ తీవ్రనష్టాలు వచ్చాయి. అదృష్టవశాత్తూ 2022 నుండి టూరిజం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ఎప్పుడూ లేనివిధంగా శ్రీనగర్ లో ఈ ఏడాది ఎక్కువ మంది టూరిస్టులు వచ్చారు. జీ20 భారత్ లో జరుగుతుంది, 29 దేశాల నుండి అన్ని శాఖల మంత్రులు, అధికారులు రాబోతున్నారు అన్నారు. 250 సమావేశాలు 56 నగరాల్లో జరగబోతున్నాయి, లక్షన్నల మంది డెలిగేట్స్ రాబోతున్నారు.
Read Also: Kishan Reddy: ఏపీలో ప్రధాన ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు
వారందరికీ మన సంస్కృతి, సాంప్రదాయాలు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. స్వదేశి దర్శన్ స్కీంలో కడప గండికోట, అరకు, లంబసింగి ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ట్రైబల్ మ్యూజియాన్ని అభివృద్ధి చూస్తున్నాం. విశాఖ నుండి అరకు వరకు అభివృద్ధి కేంద్రం చేస్తోంది. అద్దాలతో కూడిన ట్రైన్ ఏర్పాటు చేశాం. అమరావతిని స్మార్ట్ సిటీగా కేంద్రం ప్రకటించింది, 500 కోట్లు కేంద్రం కేటాయించింది. సింహాచలం, అరుణాచలం దేవాలయాలను ఈ ఏడాది అభివృద్ధి చేస్తాం అన్నారు. నెల్లూరు వేదగిరి లక్ష్మీనరసింహస్వామీ ఆలయాన్ని ఈ ఏడాది అభివృద్ధి చేయడానికి సహాయం అందిస్తాం అని కిషన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నుండి 2014 వరకు దేశం నుండి అక్రమంగా తరలించిన వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
13 అర్టికుటీస్ ని తీసుకొచ్చాం, 269 అర్టికుటీస్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దేశప్రధాని మోడీ వల్ల టూరిజం మరింత అభివృద్ధి చెందుతోంది. ఏపీలో విద్యాశాఖలో యూవర్ టూరిజాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అన్నారు. టూరిజం ప్రాంతాలలో పిల్లలకు చూపించడం ద్వారా చరిత్రపై పిల్లలకు మరింత అవగాహన పెరుగుతుంది. మోడీ వచ్చిన తరువాత 169 దేవాలయాలను అభివృద్ధి చేసారు. అయోధ్య దగ్గర నుండి కాశీ మొదలు, ఉజ్జాయినీ మహంకాళీ అమ్మవారి ఆలయం వరకు అభివృద్ధి చేస్తూ వచ్చాం అన్నారు కిషన్ రెడ్డి.
Read Also: DK Aruna: బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయం.. మేం చెప్పింది నిజమని రూఢీ చేసేలా వెంకటరెడ్డి వ్యాఖ్యలు