ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించిన ప్రభుత్వాలు 2001లో రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రేరేపించాయి. స్వరాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణపై ఆంధ్రా నాయకుల రాజకీయ ఆధిపత్యం అంతరించి, కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. కానీ, తెలంగాణకు జరిగిన అన్యాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ అన్ని రంగాలలో అపూర్వమైన పురోగతిని సాధించింది. కొత్త రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన సహాయాన్ని కేంద్రప్రభుత్వం అందజేసి ఉంటే ఇప్పటికి తెలంగాణ ఊహించని విధంగా పురోగతి సాధించేది. కేంద్ర ప్రభుత్వం…