IT Rides at 30 places in Hyderabad: హైదరాబాదులో రియల్ ఎస్టేట్ కంపెనీ పై ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు. 30 చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్ గ్రూప్ తో పాటు మరొక రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు చేస్తున్నారు. రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు శివార్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న కోహినూర్ కంపెనీ సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్ గ్రూప్ అఫ్ కంపెనీ ఎండి మజీద్ తోపాటు డైరెక్టర్లు ఐటీ సోదాలు చేస్తున్నారు. కోహినూర్ గ్రూపు పలు ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసినట్లు గుర్తించారు. ఒక రాజకీయ నాయకుడికి బినామిగా ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాదులో కోహినూర్ గ్రూప్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read also: SpiceJet: స్పైస్‌జెట్ పైలట్లకు గుడ్‌న్యూస్.. జీతం నెలకు రూ.7.5 లక్షలకు పెంపు
తాజాగా.. ఏప్రిల్ లో చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ జీ స్వకేర్‌పై ఐటీ దాడులు జరిగాయి. తమిళనాడులోని చెన్నైతో పాటు దాదాపు 50 ప్రాంతాల్లోని కంపెనీ కార్యాలయాలపై ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ దక్షిణ భారతదేశంలో వందలాది ప్రాజెక్టులను చేపట్టింది. దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తోంది. అయితే ఈ కంపెనీ పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడుతోందని ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. ఈ సంస్థ అధిక స్థాయిలో నల్లధనాన్ని సేకరించినట్లు కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో దాదాపు 50 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో జీ స్క్వేర్ సంస్థ హైదరాబాద్‌లో రెండు వెంచర్లను ప్రారంభించింది. ప్రస్తుతం ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
Love Tragedy: ప్రేమ పేరుతో మోసం చేసిందని.. ఇంట్లోకి చొరబడి..