ఇసుక, రాయి, గ్రానైట్.. దేనినీ వదలడం లేదు అక్రమార్కులు.. గ్రామాల్లో అక్రమ మైనింగ్ కి పాల్నడుతూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరణ్ కోర్ట్ గ్రామ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తున్నారు. దీనిపై ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి స్పందించిన రెవిన్యూ, మైనింగ్ అధికారులు ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. అక్రమంగా మైనింగ్ ఎవరైనా నిర్వహించినట్లయితే చట్టపరమయిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Arvind Kejriwal: యూనిఫాం సివిల్ కోడ్‌కు ఓకే.. కానీ ఇది బీజేపీ ఎన్నికల స్టంట్
రెండు మూడు రోజుల్లో ఆ ప్రాంతంలో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిలో మైనింగ్ కొనసాగినట్లు నిర్ధారణ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఈ అక్రమ మైనింగ్ జరగడంతో కొంతమంది రాజకీయ నేతల అండతో ఈ వ్యవహారంలో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అక్రమ మైనింగ్ పై ఎన్టీవీ కథనానికి అధికారులు స్పందించడంపై ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మైనింగ్ లారీల వల్ల తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అక్రమ మైనింగ్ వల్ల సహజ వనరులు మాయం అవుతున్నాయన్నారు.
Vikarabad, illegal mining, Raids, Tandur Mandal, Karan Court area, Ntv Effect