HCU: ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి సంఘం అయిన ‘‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP)’’ జయకేతనం ఎగరేసింది. ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుంది. కూటమికి చెందిన శివ పాలెపు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమికి చెందిన శ్రుతి ప్రియ ప్రధాన కార్యదర్శి, సౌరభ్ శుక్లా సంయుక్త కార్యదర్శి పదవుల్ని గెలుచుకున్నారు.
Congress:`నైపుణ్యం కలిగిన కార్మికులకు ఇచ్చే H-1B వీసాలపై అమెరికా 100,000 డాలర్ల (రూ. 88 లక్షలకు పైగా) వార్షిక రుసుమును విధించింది. ట్రంప్ తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల భారతీయులపై చాలా ప్రభావం పడుతోంది. 70 శాతం హెచ్1బీ వీసా హోల్డర్లు భారతీయులే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే, ఈ నిర్ణయం తర్వాత, ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. Read Also: Viral Wedding: పోయే…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు రాష్ట్ర రాజకీయాలు, పాలన, జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూనే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఇండియా కూటమి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తేల్చి చెప్పారు. ఒక జాతీయ మీడియాకు తేజస్వి యాదవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
Sam Pitroda: కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా భావించే సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో రాజకీయ రచ్చకు కారణమైంది. పొరుగుదేశమైన పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. పాకిస్తాన్‌తో సహా ఈ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా భారత విదేశాంగ విధానం ప్రారంభం కావాలని పిట్రోడా అన్నారు.
అధికార పార్టీకి వత్తాసుగా కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లు చోరీ చేస్తుందంటూ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. తాజాగా మరోసారి శుక్రవారం ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘ఉదయం 4 గంటలకు నిద్రలేవండి.. 37 సెకన్లలో ఇద్దరు ఓటర్లను తొలగించండి. ఆపై తిరిగి నిద్రపోండి.’’ అని ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి రాహుల్‌గాంధీ పోస్ట్ చేశారు.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలో గురువారం మీడియా ముందుకు వచ్చారు. కొన్ని ఉదాహరణలు వివరిస్తూ, దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని అన్నారు. కర్ణాటకలో అలంద్ నియోజకవర్గంలో 6000 ఓట్లను తొలగించినట్లు ఆరోపించారు. కేంద్రం ఎన్నికల సంఘం ఓట్ చోరీకి పాల్పడే వారికి అండగా నిలుస్తుందని ఆరోపణలు చేశారు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తు్న్నారని అన్నారు.
BJP: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ వాదనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అలంద్ నియోజకవర్గంతో ఉద్దేశపూర్వకంగా 6000 ఓట్లను తొలగించారని, దీని వెనక కేంద్ర ఎన్నికల సంఘం ఉందని, ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తు్న్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను సామూహికంగా తొలగించారిన ఆరోపించారు. రాష్ట్రం వెలుపల నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లు ఉపయోగించి తొలగిస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.
త్వరలో ఎన్నికల సంఘంపై హైడ్రోజన్ బాంబ్ పేల్చబోతున్నట్లుగా ప్రకటించినట్టుగానే గురువారం రాహుల్‌గాంధీ పేల్చారు. ఓట్ల చోరీపై గతంలో కొన్ని ఆధారాలు బయటపెట్టగా.. ఈరోజు మరిన్ని ఆధారాలను బయటపెట్టారు. మీడియా ముందు వీడియో ప్రజెంటేషన్ ఇస్తూ... ఓట్ల చోరీపై 100 శాతం ఆధారాలతో రుజువులు బయటపెడుతున్నట్లు ప్రకటించారు.