CM Revanth Reddy : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాల మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరుగుతుంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన జనగణన అంశాలపై ఈ భేటీలో చర్చలు జరుగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు సమావేశానికి హాజరవుతారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా హాజరయ్యేలా పార్టీ…
CM Revanth Reddy : తెలంగాణలో కుల గణనపై ప్రభుత్వ ప్రకటన రాహుల్ గాంధీ నాయకత్వంలోని జోడో యాత్రలో చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ, శాసన మండలి విపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, కుల గణన దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన విధానం గురించి ముఖ్యంగా వివరించారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు వెళ్లిన జోడో యాత్రలో కుల గణనపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. “కుల గణన చేయడానికి అధికారంలోకి వస్తేనే…
Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపుతో పాటు ‘‘కుల గణన’’ చేస్తామని బుధవారం సంచలన ప్రకటన చేసింది. అయితే, ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ ఒత్తిడి మేరకే కేంద్రం తలొగ్గిందని, కుల గణనకు అంగీకరించిందని ఆయన అన్నారు.
Bandi Sanjay Kumar: దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటు కుల గణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగబోతోందని, అత్యంత శాస్త్రీయంగా కేంద్రం నిర్వహించే ఈ సర్వేలో కులాల వారీగా ఎంత…
Revanth Reddy: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదని, విప్లవాత్మక మార్పు తెచ్చే ఎవరైనా విప్లవకారుడని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పై బసవేశ్వరుడు ప్రభావం ఎక్కువని సీఎం అన్నారు. ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్దేలా ప్రతిపక్ష వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని…
మాజీ సీఎం కేసీఆర్పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కేసీఆర్ అంటే నాకు గౌరవం. పరిపూర్ణత చెందిన నాయకుడి అని నేను భావిస్తా. కేసీఆర్ పదేళ్లు సీఎంగా పని చేశారు... చాలా అనుభవజ్ఞులు" అని జగ్గారెడ్డి అన్నారు. కానీ.. గాంధీ కుటుంబంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సీఎం రేవంత్రెడ్డి భయానికే కేసీఆర్ అసెంబ్లీకి పోవడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ను కడిగేస్తాడు అని భయం పట్టుకుందన్నారు. అది తప్పించుకోవడానికి…
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలపై రంగంలోకి దిగింది ఏఐసీసీ.. పార్టీ లైన్ కి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన నాయకులను అంతర్గతంగా మందలించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
CM Revanth Reddy : బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ భారీ సభ నిర్వహించారు. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో చర్చ జరిగినట్లు చెప్పారు. గతంలో మావోయిస్టులతో చర్చలు…
కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలు పెట్టా.. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది.. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.. సగం దూరం నడిచేటప్పటికి నేను గతంలో లాగా లేను.. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా.. నేను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం.. మహిళలను కోటీశ్వరులను చేయడమే మా అజెండాగా పెట్టుకున్నాం.. మహిళా పారిశ్రామిక వేత్తలను బడా పారిశ్రామిక వేత్తలుగా చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి