ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. పంజాబ్‌లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి.. మరోసారి పంజాబ్‌లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఈ నేపథ్యంలో.. ఎన్నికలకు ముందే.. సీఎం అభ్యర్థిని ప్రకటించారు రాహుల్ గాంధీ.. ప్రస్తుతీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపేరునే మరోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం.. దీంతో.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీప్‌గా ఉన్న నవజ్యోత్‌సింగ్ సిద్ధూకి షాక్ తగిలినట్టు అయ్యింది.. ఇప్పటి వరకు బహిరంగంగా అంతా బాగానే ఉన్నా.. ఓవైపు సిద్ధూ, మరోవైపు చరణ్‌జిత్ సింగ్ చన్నీలు.. తమ ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. మొత్తంగా చన్నీవైపే పార్టీ మొగ్గు చూపింది..
Read Also: తెలంగాణ కరోనా అప్‌డేట్.. భారీగా తగ్గిన కొత్త కేసులు
ఇక, పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని మరికాసేపట్లో ప్రకటిస్తారన్న సమయంలో.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని స్పష్టం చేశారు.. కాగా, సీఎగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత సిద్ధూనే ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారనే ప్రచారం సాగింది.. కానీ, అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది పార్టీ.. ఆతర్వాత చన్నీ తన ఇమేజ్‌ను పెంచుకున్నారు.. దీంతో.. మరోసారి ఆయనే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.