రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.. కాంగ్రెస్ వల్లే ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయని ఆరోపించిన ఆయన.. ఆ పార్టీ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని, ఫలితంగా దేశానికి హాని జరుగుతుందంటూ ఫైర్ అయ్యారు.. భారత్ అంటే ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోడీ.. ఓ రేంజ్‌లో కాంగ్రెస్‌పై మాటల దాడికి దిగారు..
Read Also: బ్రేకింగ్: తెలంగాణలో కరోనా ఆంక్షలు ఎత్తివేత
ఇక, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరును ‘ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్‌గా మార్చాలని సలహా ఇచ్చారు ప్రధాని మోడీ.. కాంగ్రెస్ లేకపోయుంటే ఏం జరిగేది? అని కొందరు అడుగుతున్నారంటూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన ప్రధాని.. కాంగ్రెస్ లేకపోయుంటే, దేశంలో ఎమర్జెన్సీ అమలయ్యేది కాదన్నారు. కుల రాజకీయాలు కూడా ఉండేవి కావు.. సిక్కులు ఊచకోతకు గురై ఉండేవారు కాదు.. కశ్మీరీ పండిట్ల సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావు అంటూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ సమాఖ్య తత్వం గురించి ఉపన్యాసాలు ఇస్తుందన్న ఆయన.. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాత్రం ముఖ్యమంత్రులను చిల్లర విషయాలపై తొలగిస్తుందని ఆరోపించారు.. అప్పటి ప్రధాన మంత్రి కుమారుడు విమానాశ్రయంలో ఏర్పాట్లు ఇష్టపడనందుకు ఆంధ్రప్రదేశ్ సీఎంని తొలగించారంటూ విమర్శలు గుప్పించిన మోడీ.. అదేవిధంగా కర్ణాటకలో ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను అగౌరవంగా తొలగించిందని ఆరోపించారు.. ఇటువంటి సంకుచిత ఆలోచనా ధోరణితో బీజేపీ పని చేయదని తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, దేశం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.