ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో ఆయన కీలక అంశాలు వెల్లడించారు. బీజేపీ ఇప్పుడు ఎదుగుతూ వుంది. దానికి మేం కారణం కాదు. కాంగ్రెస్ బలహీనంగా వుంది. మతాన్ని ఉపయోగించుకుని ముందుకెళుతోంది. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల బీజేపీ యూపీలో ఎదిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీలో కలిసిపోయారు. మేం కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం అని భావించలేదు. కమ్యూనిస్టుల శక్తి ఏంటో మాకు తెలుసు. కాంగ్రెస్ మీద అసహనంతో బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్ ని అవసరమయిన సమయాల్లో విమర్శించాలి.
ఇతర పార్టీలు మమ్మల్ని ఉపయోగించుకుని ఫలితం సాధించాయంటే మా బలం పెరుగుతుంది. సరైన విధానాలు అనుసరించినప్పుడు ఇతర పార్టీలకు లాభం కలిగింది. సీట్ల కోసం మేం మద్దతిచ్చాం. మాకు కూడా సీట్లు వచ్చాయి. విధానాలకు అనుగుణంగా మేం మారుతున్నాం.
బీజేపీకి వ్యతిరేకంగా వున్నవారిని మేం సమర్ధిస్తాం. బీజేపీ గురించి కేసీఆర్ వ్యతిరేకతతో వున్నారు. కాబట్టే మేం ఆయన్ని కలిశాం. మమ్మల్ని వాడుకోదగినంత అవకాశం మేం ఇవ్వం అన్నారు రాఘవులు. దేశంలో ఐక్యతను కోరుకునేవారు కమ్యూనిస్టుల్ని ఆదరిస్తారు. మేం సీట్లు కోసం పనిచేయడం లేదు. ప్రజలు మాపై దురుద్దేశంతో లేరు. భావసారూప్యత కలిగిన పార్టీలను మేం వివిధ దశల్లో చూస్తాం. మా మౌలిక విధానాలకు అనుగుణంగా వున్న వామపక్ష పార్టీలను మేం ఆహ్వానిస్తాం. ఫాసిస్టు ఎజెండా దేశంలో అమలు చేయాలని బీజేపీ చూస్తోంది. ఏ రాష్ట్రంలో ఏ శక్తి బలంగా వుందో వారితో కలుస్తాం. బీజేపీని ఓడించే శక్తులకు మేం సాయం చేస్తాం అన్నారు బీవీ రాఘవులు.
మా లోపాల వల్లే టీఎంసీ ఎదిగింది. ప్రధాని ఎవరు అనేది ఇప్పుడే నిర్ణయించలేం. బీజేపీని ఓడించడానికి ఏం చేయాలి, సీపీఎం బలం పెంచుకోవడంపై మహాసభల్లో చర్చించాం. బీజేపీ గెలిచే చోట ఓట్లు చీలకుండా చూస్తాం. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు వచ్చిన ఓకే. ఎన్నికల తర్వాత పరిస్థితులు మారతాయి. ఫాసిజానికి మద్దతిస్తే మా మనుగడ వుండదు. ఆర్ఎస్ఎస్ సహాయంతో బీజేపీ సంపూర్ణ ఫాసిజం అమలుచేయనుంది. గత ఎన్నికల్లో మేం పొత్తులు లేకుండా పోటీచేశాం. ఏ పార్టీ అడిగినా మేం ఎగేసుకుని ముందుకెళ్ళం. కాంగ్రెస్‌తో కలవం. రాజకీయాలే కన్ఫ్యూజన్. మేం ఒక్కరమే స్పష్టంగా ముందుకెళుతున్నాం ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో అన్నారు బీవీ రాఘవులు.