కొందరు నేతల ప్రవర్తనకు, ఉపన్యాసాలకు ఫిదా అయిపోతారు.. అభిమానులుగా మారిపోతారు.. తమ నేత ఏ నిర్ణయం తీసుకున్నా వాటికి మద్దతుగా నిలుస్తుంటారు.. వాటికి ప్రచారం చేస్తుంటారు.. ఇక, తమ నేత జోలికి ఎవరు వచ్చినా.. వీరు తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతారు.. ఇలా మన నేతలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు.. నచ్చిన నేత కోసం ప్రాణాలైనా ఇస్తామని చాలా మంది చెబుతుంటారు.. కానీ, ఓ వృద్ధ మహిళ రాహుల్ గాంధీపై తనకు ఉన్న అభిమానంతో.. తన ఆస్తినంతా ఆయనకు రాసిచ్చి వార్తాల్లోకి ఎక్కారు.. ఉత్తరాఖండ్రాజధాని డెహ్రాడూన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: DAIRY FARMING: డైరీలో ఒక రోజు
డెహ్రాడూన్‌లోని నెహ్రూ కాలనీకి చెందిన మేఘరాజ్ కుమార్తె పుష్పమంజీలాల్ వయస్సు 78 ఏళ్లు.. అయితే, తన పేరుపై ఉన్న మొత్తం ఆస్తులను కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీకి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన ఆమె.. దానిపై ఓ వీలునామా తయారు చేయించారు.. ఆ పత్రాలను కోర్టులో సమర్పించారు.. తన వీలునామాలో రాహుల్ గాంధీ తన వారసుడిగా పేర్కొన్న ఆమె.. అతని ఆలోచనల ద్వారా చాలా ప్రభావితమయ్యాయని తెలిపారు.. తన పేరుపై ఉన్న 50 లక్షల విలువైన ఆస్తులతో పాటు 10 తులాల బంగారంతో సహా తన మొత్తం ఆస్తి యాజమాన్యాన్ని హక్కులను రాహుల్ గాంధీకి అప్పగించాలని కోర్టును అభ్యర్థించారు.. మీడియా కథనాల ప్రకారం, ముంజియాల్.. రాహుల్ గాంధీ ఆలోచనలచే చాలా ప్రభావితమయ్యారు.. ఇక, దేశ అభివృద్ధికి అతని ఆలోచనలు అవసరమని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కావచ్చు, ఈ దేశ ఐక్యత, సమగ్రత కోసం వారి కుటుంబ సభ్యులు తమ జీవితాలను త్యాగం చేశారని పేర్కొంది… ఇక, ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలను కాంగ్రెస్‌నేత , రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రీతమ్సింగ్కుఅందజేసినట్లు ఆ పార్టీ మెట్రోపాలిటన్ అధ్యక్షుడు లాల్‌చంద్ శర్మ తెలిపారు. తన తదనంతరం ఆస్తి మొత్తాన్ని రాహుల్ గాంధీకి అప్పగించాలని పుష్ప.. కోర్టును అభ్యర్థించింది. ఈమె పేరుపై రూ.50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్‌లు, 10 తులాలల బంగారం ఉన్నట్టుగా తెలుస్తోంది..