ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. పంజాబ్‌లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి.. మరోసారి పంజాబ్‌లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఈ నేపథ్యంలో.. ఎన్నికలకు ముందే.. సీఎం అభ్యర్థిని ప్రకటించారు రాహుల్ గాంధీ.. ప్రస్తుతీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపేరునే మరోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం.. దీంతో.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీప్‌గా ఉన్న నవజ్యోత్‌సింగ్ సిద్ధూకి షాక్ తగిలినట్టు అయ్యింది.. ఇప్పటి వరకు బహిరంగంగా అంతా బాగానే…
పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్ సీఎం అభ్యర్థిని లుథియానా వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చెన్నీయే పంజాబ్ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. అయితే సీఎం అభ్యర్థి అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నవజ్యోత్ సిద్దూకు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపించింది. అధిష్టానం ఎప్పుడూ కూడా బలహీన సీఎంలనే కోరుకుంటుందని ఇటీవల సిద్దూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి.…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడిపోయాయి.. హామీ వర్షం కురిపిస్తున్నాయి.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు.. గ్యాస్ ధర ఆల్‌టైం హై రికార్డులను తాకిన విషయం తెలిసిందే కాగా.. ఓ వైపు అధికారపక్షాన్ని టార్గెట్ చేస్తూనే.. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? అనేదానిపై కూడా హామీ ఇస్తున్నారు.. ఇక, ఇవాళ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. హరిద్వార్,…
అమర జవాన్ జ్యోతి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. రాయ్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ సైనిక బలగాల 4వ బెటాలియన్ పరిసర ప్రాంతంలో అమర జవాన్ జ్యోతిని నిర్మించతలపెట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఆ అంశంపై మాట్లాడినా సీఎం బాఘేల్.. అమర సైనికులకు నివాళిగా నిర్మాణాన్ని తలపెట్టాం.. దీనికి గురువారం రోజు రాహుల్ గాంధీ భూమి పూజ చేస్తారని ప్రకటించారు.. భారత దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తుచేసిన ఆయన..…
పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే కొనసాగుతూ వచ్చాయి.. సీఎంగా ఉన్న ఓ సీనియర్ నేత పార్టీకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు.. ఇక, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో.. సీఎం ఓవైపు, పీసీసీ చీఫ్ మరోవైపు.. తమకు తోచినట్టు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ లేదా పంజాబ్ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ…
ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో ఆయన కీలక అంశాలు వెల్లడించారు. బీజేపీ ఇప్పుడు ఎదుగుతూ వుంది. దానికి మేం కారణం కాదు. కాంగ్రెస్ బలహీనంగా వుంది. మతాన్ని ఉపయోగించుకుని ముందుకెళుతోంది. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల బీజేపీ యూపీలో ఎదిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీలో కలిసిపోయారు. మేం కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం అని భావించలేదు. కమ్యూనిస్టుల శక్తి ఏంటో మాకు తెలుసు. కాంగ్రెస్ మీద అసహనంతో బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్ ని అవసరమయిన సమయాల్లో విమర్శించాలి.…
పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. జనవరి 3న మోగాలో జరిగే ర్యాలీలో రాహుల్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లలో 77 సీట్లు గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించింది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సాద్-బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపింది. ఆమ్ ఆద్మీ…
సోమవారం రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడడంపై ఆయన స్పందిస్తూ ‘దమ్ముంటే చర్చ పెట్టండి’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సవాల్ విసిరారు. మోడీ ప్రభుత్వానికి అసలు పార్లమెంట్‌ను నడిపించడమే రాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులపై సస్పెండ్ వేటు ఎత్తి వేయడంతో పాటు పలు సమస్యలపై చర్చలు జరిపించాలని ప్రతిపక్షాలు నినాదాలు చేస్తున్నాయి. దీంతో సోమవారం కూడా సభను రెండు సార్లు సభను వాయిదా వేశారు. సభలను మాటిమాటికీ వాయిదా వేస్తుండటంపై…
ఈనెల 28 వ తేదీన ముంబైలో కాంగ్రెస్ పార్టీ భారీ సభను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున ముంబైలో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. దీనికోసం శివాజీ పార్క్‌లో బుక్ చేసుకోవాలని అనుకున్నారు. ఏర్పాట్ల కోసం డిసెంబర్ 22 నుంచి 28 వరకు శివాజీ పార్క్‌ను అద్దెకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌ను కోరింది. అయితే, శివాజీ పార్క్ సైలెన్స్ జోన్లో ఉందని, అక్కడ…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన స్వరం మార్చారు. ఇటీవల రాహుల్ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిషోర్… తాజాగా తన మాట మార్చుకుని రాహుల్ ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ పరివారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించగలదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ చేసిన తాజా వ్యాఖ్యలు…