తెలంగాణలో కాంగ్రెస్- ఎంఐఎం మధ్య దోస్తీ వుందని భావిస్తున్న వేళ రాహుల్ గాంధీతో సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు క్లారిటీ లభించింది. ఢిల్లీలో జరిగిన భేటీలో కీలకాంశాలు చర్చకు వచ్చాయి. టీఆర్ఎస్, ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని అడిగిన సీనియర్లకు రాహుల్ బదులిచ్చారు. ఆ రెండుపార్టీలతో దోస్తీ లేదన్నారు రాహుల్ గాంధీ.
సమావేశంలో తెలుగులో మాట్లాడారు మాజీ మంత్రి జానారెడ్డి. జానారెడ్డి వ్యాఖ్యలు ఇంగ్లీషులో తర్జుమా చేసి రాహుల్ కి వివరించారు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సునీల్ ని పరిచయం చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ, కర్ణాటక వ్యవహారాలు సునీల్ చూస్తారు అని చెప్పారు రాహుల్ గాంధీ. సునీల్ వ్యూహకర్త కాదు..మన పార్టీ కార్యకర్త అని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణలో పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతా కలిసి పని చేయాలని సూచించారు రాహుల్ గాంధీ.
https://ntvtelugu.com/jagga-reddy-withdraws-resignation-letter/
క్రమశిక్షణ ముఖ్యం..కలిసి మెలిసి పని చేయండి. సునీల్ రిపోర్ట్ కూడా అదే అని చెప్పారు రాహుల్ గాంధీ. ఓపిగ్గా అందరితో మాట్లాడించారు రాహుల్. ఈ సమావేశంలో 8 నిమిషాల పాటు మాట్లాడిన రాహుల్ పలు అంశాలు చర్చించారు. నియోజక వర్గాల్లో పని చేసిన వారికే టికెట్లని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. మేము చెప్తే నమ్మరు అని చెప్పిన నేతలకు… తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు తానే ఈ విషయం చెబుతానన్నారు.
పార్టీలో క్రమశిక్షణ అంశం ప్రస్తావించారు షబ్బీర్ అలీ. ఎంతటి సీనియర్స్ అయినా పార్టీ లైన్ దాటితే వేటు వేయాలని సూచించారు. మధు యాష్కీ..మహేష్ గౌడ్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పదవులు తీసుకుని పని చేయడం లేదంటూ మహేష్ గౌడ్ కామెంట్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కలిసి పని చేశాం.. ఇప్పుడు రేవంత్ తో కూడా కలిసి పని చేయాలని చెప్పారు మాజీ మంత్రి ప్రసాద్.
వ్యక్తులు నచ్చినా నచ్చకపోయినా పార్టీ నిర్ణయం మేరకు పని చేయాలని పేర్కొన్నారు ప్రసాద్. ఇంత మందిలో ఏం మాట్లాడలేం అని చెప్పిన మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే, ఇంత కంటే షార్ట్ లిస్ట్ చేయలేమని చెప్పేశారు రాహుల్ గాంధీ. పార్టీలో అందరూ కలిసి పని చేయాలని.. అభిప్రాయ భేదాలు పార్టీకి నష్టం అని చెప్పారు ఎమ్మెల్యే సీతక్క. మొత్తం మీద రాహుల్ తో సమావేశంలో నేతలకు ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నారు.