Musharraf wanted to see Rahul Gandhi as PM: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మరణించారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. గతంలో పర్వేజ్ ముషారఫ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ హస్తం పార్టీపై విరుచుకుపడుతోంది. ఆదివారం తన సంతాప సందేశంలో ముషారఫ్ ను ప్రశంసించాడు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా…
Mamata Banerjee criticizes BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బును బీజేపీ తన పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు ఉపయోగిస్తోందిని మంగళవారం దీదీ ఆరోపించారు. పుర్బా బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యలపై ఉత్తరాఖండ్ మంత్రి గణేష్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. బలిదానం అనేది గాంధీ కుటుంబానికి చెందిన గుత్తాధిపత్యం కాదని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు ప్రమాదాలేనని మంత్రి గణేష్ జోషి మంగళవారం అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం పూర్తి కాగా.. శ్రీనగర్లో సోమవారం కాంగ్రెస్ ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం శ్రీనగర్లోని షేర్-ఏ-కశ్మీర్ స్టేడియంలో ముగుస్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భావసారూప్యత కలిగిన 23 పార్టీలకు ఆహ్వానం పంపింది.
జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. చైనా ఆక్రమించిందని ప్రతిపక్ష నేతలు చెబుతున్న భూమిని వాస్తవానికి 1962లోనే ఆక్రమించారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్ర ముగింపుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్న రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన భారీ బహిరంగ సభతో ముగియనుంది.