Rahul Gandhi: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెలలో యూకే పర్యటనకు వెళ్లనున్నారు. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ స్కూల్ లో ఉపన్యాసం ఇవ్వనున్నారు. యూకే పర్యటన వివరాలను రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించచి ఉపన్యాసం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. "భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, ప్రజాస్వామ్యంతో సహా వివిధ అంశాలపై కొంతమంది తెలివైన వారిని కలుసుకోవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణకు వ్యతిరేఖంగా కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజలు ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తోందని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంత ప్రజలు బీజేపీని ఎదుర్కోవాల్సిందే అని అన్నారు.
Mallikarjun Kharge: వ్యాపారవేత్త అదానీకి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక పార్లమెంట్ ను కదిపేస్తోంది. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ టార్గెట్ గా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై లోక్ సభలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఆయన ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డుల నుంచి తొలగించారు.
Rahul Gandhi accuses PM of protecting Adani: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్లమెంట్ లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన స్పీచ్ పై స్పందించారు. ప్రధాని ప్రసంగంతో నేను సంతృప్తి చెందలేదని.. గౌతమ్ అదానీ, ప్రధాని స్నేహితుడు కాకపోతే విచారణ జరపాలని చెప్పి ఉండాల్సిందని.. ఆయన విచారణ గురించి మాట్లాడలేదని అన్నారు. ప్రధాన మంత్రి అదానీని రక్షిస్తున్నారని స్పష్టం అయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. నేను అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇవ్వలేదని అన్నారు. ఢిఫెన్స్…
PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ, విపక్షాలపై పార్లమెంట్ లో విరుచుకుపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం తప్పా మేం చేయడం లేదని, అన్ని అబద్ధపు ఆరోపణలే అని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై ఆరోపణలు, కేసు ఓడిపోతే న్యాయస్థానాలపై ఆరోపణలు, తమకు నిర్ణయం అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం లోక్సభలో గౌతమ్ అదానీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాలను చూపించి పెద్ద రచ్చ సృష్టించారు. గౌతమ్ అదానీకి ప్రభుత్వానికి ఉన్న సంబంధాలపై, దేశంలో సంపదపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.
Rahul Gandhi criticizes BJP in Adani case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో అదానీ వ్యవహారం, అగ్నివీర్ స్కీమ్ గురించి విమర్శించారు. భారత్ జోడో యాత్ర అనుభవాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతుల సమస్యలు నా దృష్టికి వచ్చాయని వెల్లడించారు. అగ్నివీర్ యోజన సైనికులు నుంచి వచ్చిన ఆలోచన, ప్రతిపాదన కాదని, ఈ ఆలోచన, ప్రతిపాదన జాతీయ భద్రత సలహాదారు…