Rahul Gandhi:‘మోదీ ఇంటి పేరు’ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువునష్టం కింద ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కర్ణాటక కోలార్ లో పర్యటిస్తూ ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ దొంగలందరికి మోదీ ఇంటిపేరు ఎందుకు ఉంటుంది’’ అని ప్రశ్నించారు. ఈ కేసులో రెండేళ్లు శిక్ష విధించిన కోర్టు, 30 రోజలు బెయిల్ మంజూరు చేసింది. పైకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు సమయం ఇచ్చింది.
Read Also: Viral News : సింహాన్నే పరిగెత్తించిన వీధి కుక్కలు.. తోక ముడిచిన మృగరాజు
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు పలువురు న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో భారీ కుదుపుకు దారి తీయనుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం, పార్లమెంటు సభ్యుడు ఏదైనా నేరానికి పాల్పడి కనీసం రెండేళ్ల జైలు శిక్ష విధించిన క్షణం, అతను లేదా ఆమెపై అనర్హత వేటు పడుతుందని తెలియజేస్తుంది. ఐపీసీ సెక్షన్ 499 ప్రకారం గాంధీ దోషిగా నిర్ధారించిన క్రిమినల్ పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష చాలా అరుదు అని నిపుణులు చెబుతున్నారు. అనర్హత నుండి మూడు నెలల రక్షణ కల్పించే చట్టంలోని ఒక నిబంధనను లిల్లీ థామస్ కేసులో సుప్రీం కోర్టు 2013లో ‘అల్ట్రా వైర్స్’గా కొట్టివేసింది.
అయితే సూరత్ కోర్టు 30 రోజలు పాటు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. అంటే ఈ 30 రోజుల్లో రాహుల్ గాంధీ పైకోర్టులో నేరారోపణలపై స్టే తెచ్చుకోవాలి. లేక పోతే 30 రోజలు గడువు ముగిసిన నాటి నుంచే అనర్హత వేటు పడుతుంది. ఎంపీ పదవి కోల్పోతారు. ఇది క్రిమినల్ కేసు అయినందుకున రాహుల్ గాంధీ నేరుగా గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించలేరు.