ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. అయితే.. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మానిక్ రావు థాక్రే మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యానికి ఇవి చీకటి రోజులు అని, పార్లమెంట్ ప్రక్రియలకు చీకటి రోజులు వచ్చాయని ఆయన అభివర్ణించారు. తీవ్రమైన నిర్బంధం.. దేశంలో నియంత పాలన సాగుతుందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారని, ప్రజల్లో రాహుల్ గాంధీ పట్ల విశ్వాసం పెరిగిందని. రాహుల్ గాంధీ ని చూసి బీజేపీ, మోడీ భయపడుతుందోని ఆయన వ్యాఖ్యానించారు. మోడీకి, బీజేపీ కి భయపడమని ఆయన వెల్లడించారు.
Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీ హైకోర్టు నుంచి ఉపశమనం పొందకపోతే..?
న్యాయపరంగా, చట్ట పరంగా మేము కొట్లాడుతామని, ప్రజల మద్దతు మాకు సంపూర్ణంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ.హనుమంత రావు మాట్లాడుతూ.. మోడీని రాహుల్ గాంధీ ఏదో అన్నారని పరువు నష్టం కేసు వేశారని, సూరత్ జిల్లా కోర్టు 2 ఏళ్ల జైల్ శిక్ష వేసింది 30 రోజుల గడువు ఇస్తూ బెయిల్ కూడా ఇచ్చిందన్నారు. 30 రోజుల గడువు ఉండగానే ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. గతంలో అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారని, ఇలా ఎవ్వరు చేయలేదని, రాహుల్ గాంధీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు పైన పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
Also Read : Reliance Jio: షాకిచ్చిన జియో.. ఇక, ఆ ప్లాన్ మాయం