DK Aruna : రాహుల్ గాంధీకి పిచ్చిపట్టినట్లుంది.. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావట్లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పిచ్చిపట్టినట్లుందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీమంత్రి మతి డీకే అరుణ. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావట్లేదని మండిపడ్డారు. మోడీ అనే పేరున్న వాళ్లంతా దొంగలే అని సంబోధిస్తారని ఆమె ధ్వజమెత్తారు. హిండెన్ బర్డ్ విషయంలో అదానీకి అనుకూలంగా తీర్పు రాబోతోందని జడ్జిల కమిటీని అవహేళన చేస్తూ న్యాయ వ్యవస్థనే కించపరుస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. లండన్ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారత్ పరువు తీశారంటూ దేశ ప్రతిష్టను మంట కలపారని, రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు డీకే అరుణ.
Also Read : Mallikarjun Kharge: ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య.. రాహుల్ కోసం పోరాడుతాం..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
‘‘దొంగల ఇంటి పేరు మోడీ’’ అంటూ చేసిన తప్పుడు వ్యాఖ్యల ఫలితంగానే రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిస్తే బీజేపీకి సంబంధమేంటి? కోర్టు తీర్పుకు, బీజేపీకి లంకె పెడుతూ కాంగ్రెస్ గాయి గాయి చేయడం సిగ్గు చేటని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా దేశంలో అణగారిన వర్గాలపై కాంగ్రెస్ అహంకారానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిదర్శనం.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు పట్టిన శని అని, ఆయన ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తక్షణమే రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read : Pooja Ceremony: ‘రేవ్ పార్టీ’కి క్లాప్ ఇచ్చిన ‘ది కశ్మీరీ ఫైల్స్’ నిర్మాత!
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!