కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. మోదీ ప్రభుత్వ దోపిడీని, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని సీతక్క ఆరోపించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నది ఎంత వాస్తవమో, ఈ దేశం కోసం, దేశ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కి ఆయన్ను ఆపాలనుకోవటం మీ తరం, ఎవరితరం కాదని ఆమె నిప్పులు చెరిగారు. ఇలాంటి కేసులు, బెదిరింపులకు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన కుటుంబం వారిదని, మహిళలపై అత్యాచారాలు, దాడులకు పాల్పడుతున్నారని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారని ఆమె విమర్శించారు.
Also Read : PKSDT: పవర్ స్టార్ – సుప్రీమ్ హీరో మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
మోడీ అన్న పేరున్న వాళ్లకు దురదృష్టమో, అదృష్టమో ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అని అంటే.. రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారని, ఎంపీగా అనర్హత వేటు వేయించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను చూసి మోడీ బీజేపీ ప్రభుత్వం ఎందుకింత భయపడుతుందని ఆమె ప్రశ్నించారు. ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని,మొన్న బీబీసీ, నిన్న హిండెన్ బర్గ్, నేడు రాహుల్ గాంధీ అంటూ ఆమె ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి, స్వాతంత్య్రం కోసం ఏళ్ల తరబడి జైలు జీవితాలు అనుభవించిన కుటుంబాలు వారివని సీతక్క వ్యాఖ్యానించారు.
Also Read : Manchu Manoj: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన సారథి.. అసలు ఎవరితను..?