Mamata Banerjee-Akhilesh Yadav New Front Without Congress: 2024 లోక్ సభ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలు తమ ఎన్నికల ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ చీఫ్ మమతా బెనర్జీని కోల్కతాలో కలిశారు. ఇరువురు నేతల భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న…
Mallikarjun Kharge: ‘జాతీయ వ్యతిరేక టూల్ కిట్’లో రాహుల్ గాంధీది శాశ్వత భాగస్వామ్యం అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే విరుచుకుపడ్డారు. బీజేపీనే దేశ వ్యతిరేకుల పార్టీ అని, వారు భారతస్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదని ఆయన అన్నారు. బ్రిటిష్ వారి కోసం పని చేశారని దుయ్యబట్టారు. ఇంత చేసినవారు ఇతరులను దేశ వ్యతిరేకులుగా పిలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
లండన్లో ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అయ్యారు. వయనాడ్ ఎంపీ విదేశీ గడ్డపై దేశాన్ని పరువు తీశారని అన్నారు.
టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్సే హాత్జోడో పాదయాత్ర నిజామాబాద్ నియోజక వర్గంలో కొనసాగతుంది. నేడు ఆర్మూర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు.
లండన్ వేదికగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత రాజకీయ దుమారాన్ని రాజేశాయో తెలిసిందే. రాహుల్ ప్రసంగంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి.
Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో తనను మాట్లాడేందుకు అనుమతి వచ్చేలా కనిపించడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం తమాషాలు చేస్తుందని విమర్శించారు.
Smriti Irani Slams Rahul Gandhi: ఇటీవల లండన్ వేదికగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. విదేశీ గడ్డపై భారతదేశ పరువు తీశారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి సంస్థలను ఆయన అగౌరపరిచారని అన్నారు. భారతదేశాన్ని అవమానించడం ప్రజాస్వామ్యామా..? సభాపతిని అగౌరపరచడం ప్రజాస్వామ్యామా.? అని ఆమె రాహుల్ గాంధీని ప్రశ్నించారు. వెంటనే రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని…
Rahul Gandhi: మరికొన్ని రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కర్ణాటకకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో ఇరు పార్టీలు పోటాపోటీగా ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాదిలో ఆరుసార్లు కర్ణాటకలో పర్యటించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా కర్ణాటకలో…
RSS: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల పదేపదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఆర్ఎస్ఎస్ వాస్తవికతను చూడాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేమ హోసబాలే అన్నారు. స్వలింగ వివాహాలపై కేంద్రం దృష్టితో తాము ఏకీభవిస్తున్నామని, ఆడ, మగ వారి మధ్యే వివాహం జరుగుతుందని హోసబాలే అన్నారు.
భారతదేశంలో ప్రజాస్వామ్యంపై తాను చేసిన వ్యాఖ్యలు కర్ణాటక, భారతదేశం, దేవుడిపై దాడి అని ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. లండన్ నేలపై భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం అని కర్ణాటక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.