లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, రాహుల్ కోసం పోరాటం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపడింది. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలినందున లోక్ సభకు అనర్హుడయ్యాడు.
Congress: కాంగ్రెస్ పార్టీ నేడు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటు కీలక నేతలకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం జరుగబోతోంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో బడ్జెట్ సెషన్ లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు రోజంతా వాయిదా పర్వం కొనసాగింది.
దేశాన్ని, పార్లమెంటును అప్రతిష్టపాలు చేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధవారం పార్లమెంటులో అన్నారు. ఈ విషయం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగానికి సంబంధించినది.
Rahul Gandhi:‘మోదీ ఇంటి పేరు’ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువునష్టం కింద ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కర్ణాటక కోలార్ లో పర్యటిస్తూ ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ దొంగలందరికి మోదీ ఇంటిపేరు ఎందుకు ఉంటుంది’’ అని ప్రశ్నించారు. ఈ కేసులో రెండేళ్లు శిక్ష విధించిన కోర్టు, 30 రోజలు బెయిల్…