2024 సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు జూన్ 12న పాట్నాలో సమావేశం కానున్నాయి. 18కి పైగా భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు ఈ సదస్సుకు హాజరు కానున్నాయి.
Rahul Gandhi: ప్రధాన మంత్రి కొత్త పార్లమెంట్ ప్రారంభించిన కొద్ది సేపటి తర్వాత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ‘‘ పట్టాభిషేక వేడుక’’లా పరిగణిస్తున్నామని అన్నారు. పార్లమెంట్ ప్రజల గొంతుక అని.. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రధాని పట్టాభిషేకంలా భావిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
Rahul Gandhi: నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారుతోంది. మే 28న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరుకామని 19 ప్రతిపక్ష పార్టీలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య రాష్ట్రపతిని అవమానించడమే అని అన్నారు.
Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజుల్లో చాలా మారిపోయినట్లున్నారు. ఒక్కోసారి ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులతో, మరికొన్ని సార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతతో సమావేశమవుతున్నారు.
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై రచ్చ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధాని కాదని అన్నారు.
Rajiv Gandhi : నేడు రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.
Rahul Gandhi: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత ఈ రోజు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ తో పాటు 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూర్ లోని కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లలో సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలని మల్లగుల్లాలు పడిన పార్టీ అధిష్ఠానం.. చివరకు సిద్ధరామయ్య పేరును ఖరారు చేసింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నాలుగు రోజులుగా సాగిన రాజకీయ డ్రామాకు నేటితో తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పలు సమావేశాల తర్వాత బుధవారం అర్ధరాత్రి కర్ణాటక నూతన ముఖ్యమంత్రి పేరును ప్రకటించారు.