సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కిలు ఉన్నారు. వచ్చే నెల 2వ తారీఖున ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భట్టి పాదయాత్ర ముగింపు సభకు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ రాకతో వీరి సమావేశానికి ఆసక్తి నెలకొంది.
Read Also: Spy: ‘స్పై’లో బన్నీ… ఎలివేషన్ మామూలుగా లేదుగా!
దీంతో భట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరానికి రేవంత్ రెడ్డితో పాటు వెంకట్ రెడ్డి, మధుయాష్కి వచ్చారు. ఖమ్మం సభపై భట్టితో చర్చిస్తున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగించారు అని రేవంత్ రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారాలు కూడా తెలుసుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల కోసం ఖమ్మం నుంచే రాహుల్ గాంధీ సందేశం ఇవ్వబోతున్నారు అని టీపీసీసీ చీఫ్ అన్నారు.
Read Also: Interview Tips : ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే జాబ్ వచ్చినట్లే..!!
ఖమ్మంలో రాహుల్ గాంధీ ఇచ్చే సందేశం తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జనగర్జన సభ తెలంగాణ ప్రజలకు దశ, దిశ నిర్థేశించబోతుందని ఆయన వెల్లడించారు. పొంగులేటి చేరికతో రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. చేరికలపై పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం.. బీజేపీలో ఉన్న పరిస్థితి జితేంద్ రెడ్డి ట్వీట్ ద్వారా మరోసారి స్పష్టమైంది అని రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం 2014 నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే బలమైనదని తెలుస్తుందన్నారు.
Read Also: Manipur Violence: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా?
పాట్నా మీటింగ్ కు దూరమైన కేసీఆర్.. కాంగ్రెస్ కు మిత్రుడు ఎలా అవుతాడు అని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ సొంత పార్టీ నేతలే.. బీఆర్ఎస్ తో బీజేపీ బంధం ఉన్నట్లు చెబుతున్నారు.. బీజేపీ పార్టీ అధ్యక్షుడు బిత్తిరి సత్తి.. ఎప్పుడు ఏమీ మాట్లాడుతాడో తెలియదు అని రేవంత్ రెడ్డి అన్నారు. మధుయాష్కి మాట్లాడుతూ.. దాదాపు 5 లక్షల మందితో ఖమ్మంలో సభను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్.. మొజంజాహి మార్కెట్లో గులాబీపూలు అమ్ముకునేవారు అని ఆయన అన్నారు.