వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తెలిపారు. దేశంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు సాగుతున్నాయన్నారు.
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసుపై స్పందించారు. అది ఇండియాలో కాదు.. అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అమెరికా వేదికగా బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. మోడీ సర్కారు భారత ప్రజలను భయపెడుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే ఆ విమర్శలకు బీజేపీ కౌంటర్ స్టార్ట్ చేసింది. బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తే ఆయనలోని మహ్మద్ అలీ జిన్నా ఆత్మ ప్రవేశిస్తుందని విమర్శించారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం అమెరికా చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ ఎన్నారై శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అమెరికాలోని మూడు నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రవాస భారతీయులతో, అమెరిక్ చట్టసభ సభ్యులతో సమావేశం కానున్నారు.
Rahul Gandhi with truck drivers : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల అనంతరం కొద్ది రోజులు పార్టీ నేతలతో సమావేశాలను నిర్వహించారు. అనంతరం సోమవారం అమెరికా పర్యటనకు వెళ్లారు. జూన్ 1 వరకు అమెరికాలోనే పర్యటించనున్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్లో ఏర్పడిన అంతఃకలహాలకు ముగింపు పలికేందుకు ఆ పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే దిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమవేశమయ్యారు.
BJP vs Congress: మధ్యప్రదేశ్ ఎన్నికలు ముంచుకోస్తున్నాయి. గత 20 ఏళ్లుగా అక్కడ బీజేపీనే అధికారం చెలాయిస్తోంది. అయితే గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటు కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మళ్లీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.