Rahul Gandhi: పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ హైకోర్టు 2 ఏళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధ్య చట్టం-1951 ప్రకారం రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే ఆటోమెటిక్ గా పదవి కోల్పోతారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా తన ఎంపీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ కేసులో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
Rahul Gandhi: కర్ణాటక ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నువ్వానేనా అన్నరీతిలో ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ తరుపున ప్రధాని నరేంద్రమోదీ, జేపీనడ్డా, అమిత్ షాలు కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు స్టార్ క్యాంపెనర్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మంగళవారం తీర్థహళ్లిలో ప్రచారం చేస్తున్న ఆయన మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
రాహుల్ గాంధీ అభిమానిగా తాను ఇక్కడికి వచ్చానని శివరాజ్ కుమార్ చెప్పారు. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని.. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశారని శివరాజ్ కుమార్ అన్నాడు.
గతేడాది భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించబోతున్న సందర్భంలో రాహుల్ గాంధీకి ఓ బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇండోర్‌లోకి ప్రవేశించిన వెంటనే ఆయనపై బాంబ్ వేస్తానని బెదిరిస్తూ రాసిన లేఖ అదే నగరంలోని ఓ స్వీట్ షాప్ ఎదురుగా లభించింది.
మోడీ ఇంటిపేరు కేసులో విధించిన శిక్షపై స్టే ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కింద కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. రాహుల్ పిటిషన్ పై ( ఏప్రిల్ 27 ) గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.
రాహుల్ సభ్యత్వ రద్దుపై ఏపీ నుంచి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడక పోవటంతో ఆంధ్రుడిగా తాను సిగ్గుతో తల దించుకున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్న పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదు అంటూ కేవీపీ నిలదీశారు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి), జనతాదళ్ (సెక్యులర్)తో సహా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేయడం ప్రారంభించాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం బెంగళూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటకలోని విజయపురలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనం పైన నిలబడి, వీధుల్లో, సమీపంలోని భవనాలపై గుమిగూడిన ప్రజలపై రాహుల్ గాంధీ అభివాదం చేశారు.
Rahul Gandhi : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు కర్ణాటకకు వెళ్లనున్నారు. అక్కడే రెండ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తారు.